NTV Telugu Site icon

Nassar: బాహుబలి బిజ్జాల దేవా ఇంట తీవ్ర విషాదం

Nassar

Nassar

Nassar: ఇండస్ట్రీలో వరుస మరణాలు ఏమిమానులను విషాదంలోకి నెడుతున్నాయి. గతరాత్రి.. నిర్మాత దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి మృతి చెందిన విషయం తెల్సిందే. ఇక తాజాగా ప్రముఖ నటుడు నాజర్ తండ్రి మాబూబ్ బాషా (94) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో పాటు వృద్దాప్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్పట్టు జిల్లా తట్టాన్‌మలై వీధిలోని స్వగృహంలో కన్నుమూశారు. దీంతో నాజర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. నాజర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటుడిగా, కమెడియన్ గా.. కొన్ని సినిమాల్లో విలన్ గా కూడా నటించి మెప్పించాడు. ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ మెప్పిస్తున్నాడు. ముఖ్యంగా బాహుబలి సినిమాలో రానా తండ్రి బిజ్జాల దేవాగా ఆయన నటన అద్భుతం.

Vyjayanthi Movies: కల్కి మేకర్స్ మరో లీగల్ నోటీస్..?

ఇక మొదటి నుంచి నాజర్ కు అండగా నిలిచింది తండ్రి మాబూబ్ బాషానే. సినిమాల్లోకి వెళ్తాను అన్నప్పుడు.. ఎలాంటి అడ్డంకులు పెట్టకుండా.. తన కోరిక కూడా అదే అని, ఎంత కష్టమైన నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పినట్లు నాజర్ ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. ఇక నాజర్ సినిమాల్లో అవకాశాలు రాక.. ఇండస్ట్రీని వదిలేసి వచ్చినప్పుడు కూడా తండ్రి మాబూబ్ బాషానే సర్దిచెప్పి మళ్లీ సినిమాల్లోకి పంపారట. తండ్రి ప్రోత్సాహం తోనే నాజర్ ఈ స్థాయికి వచ్చాడు. ఇక తండ్రి మరణంతో నాజర్ కృంగిపోయాడు. ఈ విషయం తెలియడంతో సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Show comments