పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, KGF తో పాన్ ఇండియా సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న సినిమా ‘సలార్’. రెండు భాగాలుగా రిలీజ్ కానున్న సలార్ నుంచి ఫస్ట్ పార్ట్ ‘సీజ్ ఫైర్’ సెప్టెంబర్ 28న ఆడియన్స్ ముందుకి రానుంది. డార్క్ సెంట్రిక్ థీమ్ తో తెరకెక్కిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ సలార్ టీజర్ బయటకి వచ్చింది. ప్రభాస్ ని డైనోసర్ తో పోల్చడంతో రెబల్ స్టార్ ఫాన్స్ మాత్రమే కాదు పాన్ ఇండియా ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అయ్యారు. ఆగస్టు నెలలో సలార్ నుంచి బ్యాక్ ట్ బ్యాక్ సర్ప్రైజ్ లు బయటకి రానున్నాయి. ఆగస్టుకి ఇంకా టైం ఉంది కానీ ఈలోపే సలార్ గురించి షాకింగ్ విషయం బయట పెట్టాడు జగ్గు భాయ్.
సలార్ సినిమాలో రాజమన్నార్ పాత్రలో నటిస్తున్న జగ్గు భాయ్, ఫస్ట్ లుక్ కి టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో “సలార్ సినిమా కోసం నేను అయిదు రోజులు మాత్రమే షూట్ చేశాను” అని చెప్పి జగపతి బాబు షాక్ ఇచ్చాడు. లేటెస్ట్ గా సలార్ సినిమాలో నాకు ప్రభాస్ కి మధ్య కాంబినేషన్ సీన్స్ లేవంటూ రివీల్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. సాలిడ్ యాక్షన్ ఫిల్మ్ లో హీరో-విలన్ కి మధ్య ఒక్క సీన్ కూడా లేకపోవడం ఏంటి అనే అయోమయం అందరిలో ఉంది. సలార్ ఫస్ట్ పార్ట్ లో జగ్గు భాయ్ vs సలార్ వార్ లేకపోయినా సెకండ్ పార్ట్ లో ఫుల్ లెంగ్త్ ఫేస్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంది. ఫస్ట్ పార్ట్ ‘సీజ్ ఫైర్’లో మాత్రం ప్రభాస్ vs పృథ్వీరాజ్ వార్ జరిగేలా ఉంది. మరి ఈ వార్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషనల్ నంబర్స్ ని రాబడుతుందో చూడాలి.
