సంక్రాంతి వార్ పై ప్రొడ్యూసర్స్ గిల్డ్ భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో ఈ సంక్రాంతి వార్ గట్టిగానే ఉండబోతోంది. తెలుగు చిత్రసీమలో ఉన్న పెద్ద హీరోలంతా పొంగల్ బరిలోకి దిగేశారు. ఈసారి జనవరిలో ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధేశ్యామ్ వంటి చిత్రాలు ఉన్నాయి. మహేష్ బాబు చిత్రం “సర్కారు వారి పాట”ను కూడా ముందుగా సంక్రాంతికే విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. కానీ తరువాత నిర్ణయం మార్చుకున్న మేకర్స్ సినిమా విడుదల తేదీని మార్చేశారు. ఇప్పుడు మిగిలిన మూడు సినిమాల మధ్య పెద్ద యుద్ధమే జరగనుంది. మూడు పెద్ద సినిమాలు ఒకేసారి విడుదలకు సిద్ధం కావడంతో ఈ సంక్రాంతి అటు ప్రేక్షకులతో పాటు నిర్మాతలకు కూడా సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ‘భీమ్లా నాయక్’ రిలీజ్ డేట్ ను వాయిదా వేయాలంటూ నిర్మాత నాగ వంశీకి సినిమా వర్గాల నుంచి ఒత్తిడి ఎదురవుతున్నట్లుగా టాక్ నడుస్తోంది. అంతేకాకుండా నిన్న ‘భీమ్లా నాయక్’కు సంబంధించిన రిలీజ్ డేట్ ను మేకర్స్ మరోమారు కన్ఫర్మ్ చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. ‘భీమ్లా నాయక్’ జనవరి 12న విడుదలకు సిద్ధం అవుతుండగా, ఇప్పటికే అన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లు బుక్ చేసుకున్నారు.
Read Also : కేటీఆర్ మంచి నటుడు… ఇంకా నయం సినిమాల్లోకి రాలేదు !
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
అయితే ఒకేసారి ముగ్గురు స్టార్ హీరోలూ బాక్స్ ఆఫీస్ ఫైట్ కు దిగడం అనేది అంత మంచి విషయం కాదు. హీరోల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. అలాగే సినిమా సినిమాకూ కనీసం వారం అన్నా గ్యాప్ ఉంటే ఏ సినిమా నిర్మాతలూ నష్టపోకుండా ఉంటారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో జరుగుతున్న సమస్యాత్మక పరిణామాలను పరిగణలోకి తీసుకుని, వాటిని పరిష్కరించడానికి ప్రొడ్యూసర్స్ గిల్డ్ రంగంలోకి దిగింది. 2022 పొంగల్ సినిమాల విడుదలకు సంబంధించి సామరస్యపూర్వక పరిష్కారం కోసం నిర్మాతల సంఘం ఈరోజు సమావేశానికి ప్లాన్ చేస్తున్నట్లు తాజా సమాచారం. ఈ సమావేశంలో ఒక సినిమాను సంక్రాంతి బరిలో నుంచి తప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. మరి ఏ సినిమా పోస్ట్ పోన్ అవుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!