కేటీఆర్ మంచి నటుడు… ఇంకా నయం సినిమాల్లోకి రాలేదు !

‘కేటీఆర్ మంచి నటుడు… ఇంకా నయం సినిమాల్లోకి రాలేదు’ అంటూ హీరో సుధీర్ బాబు చేసిన కామెంట్స్ తాజాగా వైరల్ అవుతున్నాయి. హైటెక్స్‌లో జరిగిన ‘ఇండియా జాయ్’ కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా హాజరయ్యారు. ఇదే వేడుకకు నటుడు సుధీర్ బాబు కూడా విచ్చేశారు. ఆయన తన స్పీచ్ లో భాగంగా కేటీఆర్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సుధీర్ బాబు మాట్లాడుతూ “నేను కేటీఆర్‌కి పెద్ద అభిమానిని. ఆయన మంచి రాజకీయ నాయకుడు మాత్రమే కాదు నటుడు కూడా. ఒక నటుడు తన ఒరిజినాలిటీని, మూలాలను మరచిపోయి తన పాత్రలో బాగా నటించాలి. అలాగే ఒక మంచి రాజకీయ నాయకుడు కూడా ప్రజల కోసం పని చేయడానికి తనను, తన కుటుంబాన్ని విడిచి పెట్టాలి. ఒకవేళ సినిమాలో రాజకీయ నాయకుడి పాత్రలో నటించే అవకాశం వస్తే కేటీఆర్‌ని కాపీ కొట్టి నటిస్తాను. కేటీఆర్ సినిమాల్లోకి రానందుకు సంతోషంగా ఉంది” అంటూ కేటీఆర్ పై తనదైన శైలిలో ప్రసంశలు కురిపించారు.

Read Also : ట్రైలర్ : రూపాయ్ పాపాయ్ లాంటిదిరా… దాన్నెలా పెంచి పెద్ద చేయాలంటే…!

సుధీర్ బాబు వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందిస్తూ సుధీర్ వ్యాఖ్యలను గుర్తుంచుకుంటానని అన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ “నేను రాజకీయ నాయకుడిలా కనిపించడం లేదా? నేను నటుడిలా కనిపిస్తున్నానా? సరే సుధీర్, ఈ మాటలను నేను గుర్తు పెట్టుకుంటాను’’ అని కేటీఆర్ సరదాగా అన్నారు. సుధీర్ బాబు వ్యాఖ్యలను తాను పూర్తిగా సానుకూలంగానే తీసుకుంటున్నానని కేటీఆర్ అన్నారు. సుధీర్‌కి కృతజ్ఞతలు తెలుపుతూ సుధీర్ వ్యాఖ్యలను తాను అంగీకరిస్తున్నానని, స్వాగతిస్తున్నానని చెప్పారు. సుధీర్‌బాబు, కేటీఆర్‌ మధ్య జరిగిన సరదా సంభాషణ అక్కడ వున్న అందరినీ ఆకట్టుకుంది.

Related Articles

Latest Articles