NTV Telugu Site icon

‘ఖిలాడీ’ కోసం రంగంలోకి దిగిన కూల్ కాప్ అర్జున్

khiladi

khiladi

మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖిలాడీ. ఈ చిత్రంలో రవితేజ సరసన డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 11 న విడుదల కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ ని మొదలుపెట్టేశారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా అర్జున్ పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అర్జున్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ అర్జున్ భరద్వాజ్ గా కనిపించనున్నట్లు మేకర్స్ తెలిపారు. అంతేకాకుండా అర్జున్ క్యారెక్టరైజేషన్ కూడా తెలిపారు. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ విత్ కూల్ ఆటిట్యూడ్ అంటూ ఆసక్తి పెంచేశారు. పోలీస్ ఆవేశంలో ఉంటే యాక్షన్ ఉంటుంది.. అదే పోలీస్ కూల్ ఆటిట్యూట్ తో ఉంటే ఆ ఎత్తులు.. పై ఎత్తులు.. రవితేజ తో అర్జున్ ఆడే యాక్షన్ గేమ్స్ .. బాగా గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లు అర్ధమవుతుంది. మరి ఈ ఖిలాడీ స్మార్ట్ గేమ్స్ కి పవర్ ఫుల్ పోలీసాఫీసర్ అర్జున్ ఎలా చెక్ పెడతాడో చూడాలి.

Show comments