Site icon NTV Telugu

Mega Star: ‘ఆచార్య’ వచ్చేది అప్పుడే! మరి ట్రైలర్ ఎప్పుడంటే!!

Acharya

Acharya

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ఆచార్య’ చిత్రం ఏప్రిల్ 29న రిలీజ్ అవుతుందని ఇప్పటికే ప్రకటించారు. అయితే శనివారం మరోసారి ఆ విషయాన్ని చిత్ర బృందం ఖరారు చేసింది. ఇదిలా ఉంటే… ఈ మూవీ ట్రైలర్ ను ఈ నెల 12న విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. చిరంజీవి సరసన కాజల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటించిన ఈ మూవీని అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న కొరటాల శివ తెరకెక్కించాడు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీకి రామ్ చరణ్ సైతం నిర్మాణ భాగస్వామి కావడం విశేషం. చాలా కాలం తర్వాత మణిశర్మ చిరంజీవి చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పాటలు యూట్యూబ్ లో హల్చల్ చేస్తున్నాయి.

ఏప్రిల్ 29న ‘ఆచార్య’ వస్తున్న నేపథ్యంలో అదే రోజు రావాల్సిన విజయ్ పాన్ ఇండియా మూవీ ‘బీస్ట్’ ఈ నెల 13కి ప్రీ పోన్ అయిపోయింది. అలానే ‘ఎఫ్ 3’ మూవీ మే 27కి వాయిదా పడింది. నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాను ఏకంగా జులై 8కి తీసుకెళ్ళిపోయారు. సో… ఈ నెల 29న ‘ఆచార్య’ ఒక్క సినిమానే విడుదల కాబోతోంది. అయితే ఈ మూవీని హిందీలోనూ విడుదల చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కానీ దానిపై మేకర్స్ మాత్రం ఇంకా అధికారిక ప్రకటన ఏదీ చేయలేదు.

Exit mobile version