Site icon NTV Telugu

కామ్రేడ్ సిద్ధ బిగి కౌగిలిలో నీలాంబరి.. ‘ఆచార్య’ మెలోడీకి ముహర్తం

చిత్ర పరిశ్రమలో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ‘ఆచార్య’ ఒకటి. మెగాస్టార్ చిరంజీవి, కాజల్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు. ఇక ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా.. ఆయనకు జోడిగా పూజా హెగ్డే కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్స్, సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ నుంచి రెండో సింగిల్ ని విడుదల చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు.

‘నీలాంబరి’ అంటూ సాగే బ్యూటీ ఫుల్ మెలోడీని దీపావళి కానుకగా నవంబర్ 5వ తేదీన ఉదయం 11:07 గంటలకు విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మణిశర్మ సంగీతంలో మెలోడీ అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పన్నక్కర్లేదు. ఇక ఈ విషయాన్నీ తెలుపుతూ చరణ్, పూజా పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. కామ్రేడ్ సిద్ధ బిగి కౌగిలిలో నీలాంబరి సిగ్గుపడుతూ నిలబడిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం ఫిబ్రవరి 4 న విడుదల కానుంది.

Exit mobile version