Site icon NTV Telugu

Acharya: మెగాస్టార్ ను వదిలేసి రియల్ స్టార్ కు పాలాభిషేకం చేసిన ఫ్యాన్స్

అభిమానం.. అనేది ఎవరు ఆపలేనిది. ఒక నటుడును అభిమానులు అభిమానిస్తున్నారంటే గుండెల్లో పెట్టుకుంటారు. వారి సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే వారికి పూలాభిషేకాలు, పాలాభిషేకాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటారు. తాజాగా ఆచార్య సినిమా రిలీజ్ అయిన విషయం విదితమే.. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు. నిన్న విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకొని ప్రేక్షకులను నిరాశపరిచింది. అయినా అభిమానానికి హిట్, ప్లాప్ అనేది అవసరం లేదు.. ఇక థియటర్ల వద్ద కటౌట్లు, పూలాభిషేకాలు, పాలాభిషేకాలు.. అబ్బో  ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని సంధ్య థియేటర్లో అభిమానులు రచ్చ రచ్చ చేశారు.

ఆహా మెగా అభిమానులు ఎంత అభిమానం చూపిస్తున్నారో కదా అనుకుంటున్నారేమో .. అక్కడ పాలాభిషేకం చేసింది చిరు కు కాదు, చరణ్ కి కాదు. ఆచార్య లో విలన్ గా నటించిన రియల్ హీరో  సోనుసూద్ కు..  కరోనా సమయంలో సోనూ చేసిన పనుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సొంత ఖర్చులతో ఎంతోమంది వలస కూలీలను వారి సొంత రాష్ట్రాలకు చేర్చారు. కష్టంలో ఉన్నవారికి కాదనకుండా హెల్ప్ చేసి కలియుగ దేవుడిగా మారిన సోనూసూద్ పై అభిమానులు తమ అభిమానం చాటుకున్నారు.  ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని సంధ్య థియేటర్లో సోనూ కటౌట్ ని పెట్టి, పూలాభిషేకం చేయడంతో పాటు పాలాభిషేకం కూడా చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.  ఇప్పటివరకు మెగాస్టార్ సినిమాలకు థియేటర్ వద్ద ఆయనకు పాలాభిషేకాలు చేయడం చూశాం కానీ మొట్టమొదటిసారి విలన్ గా నటించిన వ్యక్తికీ ఇలా పాలాభిషేకం చేయడం చూస్తున్నాం అని,  రియల్ హీరోకు ఇలాంటివి ఎన్ని చేసినా తక్కువే అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version