Salaar Trailer: ఆగస్ట్ నెల అయిపొయింది… ఇచ్చిన మాట తప్పుతావా షేర్ ఖాన్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ బడ్జట్ సినిమా సలార్ సెప్టెంబర్ 28న రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. సోషల్ మీడియా బజ్ ప్రకారం.. సెప్టెంబర్ 3 లేదా 7న సలార్ ట్రైలర్ బయటికొచ్చే ఛాన్స్ ఉంది కానీ మేకర్స్ నుంచి ఈ విషయంలో అఫీషియల్ అప్డేట్ మాత్రం లేదు. నిజానికి జులై 6న సలార్ టీజర్ బయటకి వచ్చి హవోక్ క్రియేట్ చేసిన 48 గంటల తర్వాత… సలార్ మేకర్స్ అఫీషియల్ గా ఒక నోట్ రిలీజ్ చేసారు. ఆగష్టు మంత్ ఎండింగ్ వరకూ వెయిట్ చేయండి ఇండియా సినిమాలో ఇప్పటివరకూ చూడని ట్రైలర్ రాబోతుంది అంటూ హోంబలే ఫిల్మ్స్ అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో సలార్ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆగస్టు నెల మరో 24 గంటల్లో అయిపోతుంది కానీ ఇప్పటి వరకు హోంబలే ఫిల్మ్స్ నుంచి అసలు సౌండ్ లేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హోంబలే ఫిలింస్ పై మండి పడుతున్నారు.
హోంబలే ఫిల్మ్స్ మాట తప్పారని… సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అయితే సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో ఏ క్షణమైనా సలార్ ట్రైలర్ రిలీజ్ అవ్వడం గ్యారెంటీ అంటున్నారు. సలార్ రిలీజ్‌కు మరో నెల రోజుల సమయం కూడా లేదు. ఇప్పటికే సోషల్ మీడియాలో రిలీజ్ డేట్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేశారు డార్లిగ్ ఫ్యాన్స్ కానీ ట్రైలర్ కౌండ్‌డౌన్ మాత్రం ఇంకా స్టార్ట్ అవలేదు. అయితే ఇక్కడ ఇంకో లింక్ కూడా ఉంది. ఆగష్టు 31న జవాన్ ట్రైలర్ రిలీజ్ ఉంది. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ ‘ఓజి’ టీజర్ రాబోతోంది. ఈ రెండు రోజుల్లో సలార్ ట్రైలర్ రిలీజ్ చేస్తే… క్లాష్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి… ఈ రెండు డేట్స్ తప్పించి సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో సలార్ ట్రైలర్ రావడం పక్కా అంటున్నారు. దీనిపై ఏ క్షణమైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావొచ్చని టాక్. ఏ డేట్ కి వచ్చినా ఎప్పుడు వచ్చినా సలార్ ట్రైలర్ ఓ సెన్సేషన్‌గా నిలవడం మాత్రం గ్యారెంటీ.
Also Read
- Mythri Ravi: "రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు"
- Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
- Sidharth - Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
- Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
100 Million Views and we're feeling dino-mite!
Thank you all for being part of this incredible milestone. Your support means the world to us 🙏🏻#SalaarTeaser100MViews#SalaarCeaseFire ▶️ https://t.co/AhH86b1cQS#Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan… pic.twitter.com/QXOS6vscJi— Salaar (@SalaarTheSaga) July 8, 2023
తాజావార్తలు
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
-
West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!