NTV Telugu Site icon

The Kashmir Files: వివేక్ అగ్నిహోత్రి, అభిషేక్ అగర్వాల్ కాంబోలో మరో రెండు సినిమాలు!

Kashmir Files

Kashmir Files

పోస్ట్ పేండమిక్ విడుదలైన హిందీ చిత్రాలలో ‘ద కశ్మీర్ ఫైల్స్’ సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఐదో వారాంతానికి ఆ సినిమా రూ. 250.73 కోట్ల గ్రాస్ వసూలూ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ వీకెండ్ లో పెద్ద సినిమాల నుండి ఎలాంటి పోటీ లేకపోవడంతో లిమిటెడ్ స్క్రీన్స్ లోనే ఈ మూవీ శుక్రవారం 50 లక్షలు, శనివారం 85 లక్షలు, ఆదివారం 1.15 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసి రూ. 250 కోట్ల మార్క్ ను దాటిందని వారు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే… ‘ద కశ్మీర్ ఫైల్స్’ విజయంతో ఆ చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ మరింత ఉత్సాహంగా సెట్స్ పై ఉన్న తన ప్రాజెక్ట్స్ ను పూర్తి చేసే పనిలో పడ్డారు. ‘టైగర్ నాగేశ్వరరావు’తో పాటు రవితేజ నటిస్తున్న ‘థమాకా’ చిత్రానికి, నిఖిల్ ‘కార్తికేయ -2’కు కూడా అభిషేక్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఏప్రిల్ 11 సోమవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా మరో సరికొత్త వార్తనూ ఆయన ప్రకటించారు. ‘ద కశ్మీర్ ఫైల్స్’ చిత్ర దర్శకుడైన వివేక్ అగ్నిహోత్రితో కలిసి మరో రెండు సినిమాలను నిర్మించబోతున్నట్టు తెలిపారు. భారతదేశ చరిత్ర పుటల్లో ఉండిపోయిన రెండు యదార్థ గాథలను వీరు వెండితెర కెక్కించబోతున్నట్టు ఈరోజు వెలువరించిన మోషన్ వీడియో ద్వారా తెలుస్తోంది.