NTV Telugu Site icon

Raviteja: సెట్ లో రవితేజకు ప్రమాదం.. కాలికి 12 కుట్లు

Ravi

Ravi

Raviteja: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రవితేజ సరసన నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ నటిస్తుండగా.. రేణు దేశాయ్ కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేసిన చిత్ర బృందం.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నారు. ఇక నటీనటులతో పాటు.. నిర్మాత అభిషేక్ అగర్వాల్ కూడా ప్రమోషన్స్ లోపాలుపంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన సెట్ లో రవితేజకు జరిగిన ప్రమాదం గురించి ఆసక్తికరమైన విషయాల గురించి చెప్పుకొచ్చారు. టైగర్ నాగేశ్వరరావు సినిమా సెట్ లో రవితేజ కాలికి ప్రమాదం జరగడం.. 12 కుట్లు కూడా పడినట్లు చెప్పడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.

Akira Nandan: మెగా ఫ్యాన్స్ కి అఖీరా విషయంలో బ్యాడ్ న్యూస్..

” ట్రైన్‌ దోపిడీ సీన్‌లో రైలు మీది నుంచి లోపలకు దూకే షాట్‌లో రవితేజ అదుపుతప్పి కిందపడ్డాడు. ఆ సమయంలో మోకాలికి బాగా దెబ్బ తగలడంతో ఆస్పత్రికి తరలించగా 12 కుట్లు వేశారు. ఆ దెబ్బ తగిలి రెండు రోజులు కూడా కాకముందే రవితేజ సెట్ లో అడుగుపెట్టాడు. ఆ షాట్ కోసం 400 మంది జూనియర్ ఆర్టిస్టులను సెట్ చేశాం. రవితేజ .. కాలికి దెబ్బ తగిలిందని షూటింగ్ క్యాన్సిల్ చేసుకోవాల్సింది. కానీ, ఆయన మాత్రం తనవలం షూటింగ్ క్యాన్సిల్ అయితే.. ఇబ్బంది అవుతుందని అంత దెబ్బ తగిలినా విశ్రాంతి తీసుకోకుండా చేశాడు. అతని డెడికేషన్ కు హ్యాట్సాఫ్” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి అంత కష్టపడి తీసిన సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.