దర్శకుడు అశోక్ కుమార్ తెరకెక్కించిన కొత్త సినిమా మహానటులు. ఏబీఆర్ ప్రొడక్షన్స్ అండ్ ఏబీఆర్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై అనిల్ బోధిరెడ్డి, డాక్టర్ తిరుపతి ఆర్ యర్రంరెడ్డి నిర్మించారు. అభినవ్ మణికంఠ, గోల్డీ నిస్సీ, మ్యాడీ వీజే, పవన్ రమేష్, భరత్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జాతిరత్నాలు తరహాలో హిలేరియస్ ఎంటర్ టైనర్ గా రూపొందిన “మహానటులు” సినిమా ఈ నెల 25న గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. రీసెంట్ గా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
Read Also: Megastar: ఈ కన్ఫ్యూజన్ ఏంటి చిరు… కాస్త క్లారిటీ ఇవ్వు
కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో “మహానటులు” ట్రైలర్ ఆకట్టుకుంది. ముగ్గురు జాబ్ లెస్ లేజీ కుర్రాళ్లు స్టాండప్ కమెడియన్ శీను, ఫిలిం క్రిటిక్ టీబీ, మీమర్ పరదేశి లైఫ్ ను సరదాగా చూపించారు దర్శకుడు అశోక్ రెడ్డి. ఒక అందమైన అమ్మాయి ఫ్రెండ్ కావడంతో వీళ్ల లైఫ్ లో జోష్ స్టార్టవుతుంది. కానీ ఆ అమ్మాయి మనిషా, దెయ్యమా అనే సందేహాలతో కథలో ట్విస్ట్ మొదలై ఏ ముగింపు తీసుకున్నాయి అనే అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా ముగిసింది. “మహానటులు” సినిమా ఈ నెల 25న గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది.