Abbas: 12 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి అబ్బాస్ రీఎంట్రీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abbas: అబ్బాస్.. పేరు వినగానే ‘ప్రేమదేశం’ సినిమా టక్కున గుర్తుకు వస్తుంది. ఆ మూవీతో యూత్ గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న చాక్లెట్ బాయ్, చాలాకాలం తర్వాత మళ్లీ టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు వరుస హిట్ సినిమాలతో అలరించిన ఆయన, ఆ తర్వాత వరుస ఫ్లాపుల కారణంగా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమై విదేశాల్లో సెటిల్ అయ్యారు.
అయితే సుమారు 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జీవీ ప్రకాశ్ కుమార్ నటించిన ‘హ్యాపీ రాజ్’ చిత్రంతో తమిళంలో రీ-ఎంట్రీ ఇచ్చిన అబ్బాస్, ఇప్పుడు తెలుగు తెరపై కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ గ్రాండ్‌గా మొదలుపెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్లో జోరుగా టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘జనవరి 12 విడుదల’ మల్టీస్టారర్ చిత్రంలో ఆయన ఓ ప్రత్యేక, కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.
Also Read
- Nero Teaser Controversy: ప్రమోషన్ల కోసమా.. జనాల అటెన్షన్ కోసమా.. ఆ హీరో చేసింది కరెక్టేనా?
- Vrushakarma టైటిల్‌కు అసలు అర్థం చెప్పిన డైరెక్టర్.. సినిమాలో చైతూ పాత్ర ఇదేనట!
- Satvika Veeravalli vs Afiya Syed: ‘కల్పన’ క్రేజ్‌కు ‘రుక్మిణి’ చెక్ పెడుతుందా?
- కార్తీ ‘HIT 4’ స్క్రిప్ట్ రెడీ అయిపోయిందట! నాని గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్..
విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా, కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్, టైటిల్‌కు తగ్గట్టే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో సందడి చేయనుంది. చివరగా 2014లో తెలుగు సినిమాలో కనిపించిన అబ్బాస్, సరిగ్గా 12 ఏళ్ల తర్వాత సంక్రాంతి పండుగ వేళ ఆడియన్స్ ముందుకు రావడం విశేషం. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్లో అబ్బాస్ పాత్ర ఎలా ఉండబోతోందోనని, ఒకప్పటి లవర్ బాయ్‌ని మళ్లీ వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అబ్బాస్ ఎంట్రీపై మేకర్స్ నుంచి అఫిషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Abbas: 12 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి అబ్బాస్ రీఎంట్రీ..?
-
Nero Teaser Controversy: ప్రమోషన్ల కోసమా.. జనాల అటెన్షన్ కోసమా.. ఆ హీరో చేసింది కరెక్టేనా?
-
Vrushakarma టైటిల్‌కు అసలు అర్థం చెప్పిన డైరెక్టర్.. సినిమాలో చైతూ పాత్ర ఇదేనట!
-
Eyeglass Lens Scratches : కళ్లద్దాలను చొక్కాతో తుడుస్తున్నారా?.. ఈ తప్పు అస్సలు చేయొద్దు.!
-
Satvika Veeravalli vs Afiya Syed: ‘కల్పన’ క్రేజ్‌కు ‘రుక్మిణి’ చెక్ పెడుతుందా?
ట్రెండింగ్
-
BSNL బంపర్ ఆఫర్..! ఆ రీఛార్జ్‌తో రూ. లక్ష బీమా ఫ్రీ..! రూ. 10 వేల సైబర్ బీమా కూడానూ..
-
MS Dhoni: ‘7’ నంబర్‌పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
-
Jasprit Bumrah Unwanted Record: 292 బంతుల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా కెరీర్లోనే చెత్త రికార్డు!