NTV Telugu Site icon

Trailer Trending: సోషల్ మీడియాలో దుమ్ము లేపుతున్న ఆ సినిమా ట్రైలర్

Aay Trailer

Aay Trailer

Aay Movie Trailer Trending: గత ఏడాది చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో మాడ్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా మంచి గుర్తింపు పొందాడు. ఇక ఈ సినిమా తరువాత ఈసారి మ‌రో ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. నార్నే నితిన్, నయన్ సారిక జంటగా రూపొందుతోన్న చిత్రం ‘ఆయ్’.. అంజి కంచిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని వరుస విజయవంతమైన చిత్రాలను రూపొందిస్తోన్న నిర్మాణ సంస్థ GA 2 పిక్చర్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ బన్నీవాస్‌తో విద్య కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్,టీజర్స్ తో మంచి రెస్పాన్స్ సంపాదించుకున్న ఈ మూవీ తాజాగా ట్రైలర్ తోను ట్రెండ్ సెట్ చేస్తుంది.

Also Read: Khushi kapoor: చెల్లి కూడా నందమూరి హీరోతోనే టాలీవుడ్ ఎంట్రీ?

నిన్న (ఆగష్టు 5) రిలీజ్ చేసిన ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాటుఫామ్స్ అయిన యూట్యూబ్ మరియు ట్విట్టర్ లో ట్రేండింగ్ లో కొనసాగుతుంది. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీ ల‌వ్ అండ్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రానున్న‌ట్లు తెలుస్తుంది. కాకపోతే అదే రోజు రవితేజ, హరీష్ శంకర్ ‘మిస్టర్ బచ్చన్’, పూరి, రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’, తమిళ నడుటుడు చియాన్ విక్రమ్ ‘తంగలాన్’ సినిమాలతో రిలీజ్ కానుంది. మరి ఈ పోటీని తట్టుకుని ఎంత మేరకు థియేటర్లలో నిలబడుతుంది అనేది చర్చించు కోవలిసిన విషయమే. ఇక మూవీ ప్రొడ్యూసర్స్ గీతా ఆర్ట్స్ కాబట్టి థియేటర్ల పరంగా ఢోకా ఉండకపోవచ్చు. కానీ ‘ఆయ్’కి హిట్ టాక్ కూడా చాలా ముఖ్యం. ఒకవేళ మిగతా సినిమాలకు హిట్ టాక్ వస్తే మాత్రం ‘ఆయ్’ పరిస్థితి ఏంటనేది ఇక్కడ ప్రశ్న. తొలి సినిమా ‘మ్యాడ్’తో హిట్ కొట్టిన ఎన్టీఆర్ బావమరిది.. రెండో సినిమాతో ఏం చేస్తాడో చుడాలిసిందే.

Show comments