Aamir Khan: ఆమిర్ సంచలన నిర్ణయం.. సినిమాలకు బ్రేక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aamir Khan Took Break From Movies: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్గా పేరొందిన ఆమిర్ ఖాన్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సినిమాలకు బ్రేక్ తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. తన చిన్ననాటి స్నేహితులు నిర్వహించిన ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ హీరో.. ఈ సందర్భంగానే ఆ విషయాన్ని వెల్లడించాడు. తన 35 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో తాను తొలిసారి ఇలా బ్రేక్ తీసుకోబోతున్నానని తెలిపాడు. ‘‘నేను ఒక సినిమా చేస్తున్నప్పుడు, పూర్తిగా అందులోనే లీనమైపోతాను. జీవితంలో మరే విషయాలు లేవన్నట్లుగా ధ్యాస మొత్తం ఆ సినిమాపైనే పెడతాను. నిజానికి నేను లాల్ సింగ్ చడ్ఢా తర్వాత ‘ఛాంపియన్స్’ సినిమా చేయాలి. అదో అద్భుతమైన స్క్రిప్ట్. కానీ.. ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలనిపిస్తోంది. అమ్మ, పిల్లలు, నా కుటుంబంతో సమయం గడపాలనుంది’’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘నేను గత 35 సంవత్సరాల నుంచి సినిమాల్లో నటిస్తూనే ఉన్నాను. సింగిల్-మైండెడ్‌గా నా పని మీదే ఫోకస్ పెట్టాను. కానీ.. అది కరెక్ట్ కాదనిపిస్తోంది. నాకు దగ్గరగా ఉన్న వ్యక్తులతో కలిసి సమయం గడిపేందుకు ఇదే సరైన సమయమని అనిపిస్తోంది. వారితో కలిసి జీవితాన్ని మరో యాంగిల్లో చూడొచ్చు. కాబట్టి మరో ఏడాదిన్నర వరకు నటుడిగా కెమెరా ముందుకు వెళ్లకుండా, విశ్రాంతి తీసుకోవాలని ఫిక్స్ అయ్యా’’ అని తెలిపాడు. ఇదే సమయంలో ఛాంపియన్స్ సినిమా గురించి మాట్లాడుతూ.. తనకు ఈ సినిమాపై పూర్తి నమ్మకం ఉందని, అందుకే దీనికి నిర్మాతగా వ్యవహరించాలని అనుకుంటున్నానని పేర్కొన్నాడు. కాగా.. ఈ ఈవెంట్లో ఆమిర్ ఖాన్ నెరిసిన గడ్డం, తెల్లజుట్టుతో దర్శనమిచ్చి.. అందరినీ ఆశ్చర్యపరిచాడు. లాల్‌సింగ్ చడ్డా ఫెయిల్యూర్ తర్వాత తొలిసారి అతడు ఓ ఈవెంట్లో ఇలా ప్రత్యక్షమయ్యాడు.
Also Read
- Jananayagan : విజయ్ 'జననాయకుడు' ఓవర్సీస్ రివ్యూ.. వద్దు బ్రో
- 2027 Movies : క్రేజీ మూవీస్ అన్నీ 2027లోనే.. పోటీలో బాలయ్య, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్
- Richest Star Kids: హృతిక్ నుంచి అల్లు అర్జున్ వరకు.. 2026లో అత్యంత ధనవంతులైన స్టార్ కిడ్స్ ఎవరో తెలుసా?
- Students Protest : ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ ఘటనపై సల్మాన్ ఖాన్ ట్వీట్ వైరల్
తాజావార్తలు
-
US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
-
Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
-
Nokia 123 Shield: నోకియా 123 షీల్డ్ ఫీచర్ ఫోన్ విడుదల.. 19 రోజుల బ్యాటరీ బ్యాకప్, క్రేజీ ఫీచర్స్
-
India vs Zimbabwe: ఇంగ్లండ్‌లో తమ్ముడు సామ్ కరన్.. జింబాబ్వే టీమ్‌లో అన్న బెన్ కరన్.. టీమిండియాకు ‘కరన్’ గండం!
-
Guru Purnima 2026: గురు పౌర్ణమి జూలై 28నా? 29నా? సరైన తేదీ, శుభ ముహూర్తం, పూజా విధానం ఇదే
ట్రెండింగ్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!