Site icon NTV Telugu

Chiranjeevi: గిన్నిస్ బుక్ లోకి చిరంజీవి.. ఎందుకో తెలుసా?

Chiranjeevi

Chiranjeevi

ఈరోజు ఒక ఆసక్తికరమైన ప్రకటన రాబోతోంది. మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ ఓల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ రోజు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్ ను మెగాస్టార్ చిరంజీవికి అందించే ఒక కార్యక్రమం హైదరాబాదులో జరగబోతోంది. హైదరాబాదులోని ఒక స్టార్ హోటల్లో బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్.. చిరంజీవికి గిన్నిస్ రికార్డుకు సంబంధించిన అవార్డు అందించనున్నారని తెలుస్తోంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిథులతో పాటు ఆమిర్ ఖాన్ హైదరాబాద్‍కు వచ్చారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి పేరు అధికారికంగా గిన్నిస్ బుక్‍లో ఎక్కిన విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు. చిరంజీవికి గిన్నిస్ రికార్డు అందించబోతున్నారు, అనే విషయం బయటకు వచ్చింది.

Also Read: Big Boss 8 : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుసా..?

కానీ ఏ విషయంలో దక్కనుందో నేటి సాయంత్రం స్పష్టంగా వెల్లడి కానుంది. అయితే, 150కు పైగా సినిమాల్లో డ్యాన్స్ చేసినందుకు ఆయనకు ఈ ఘనత దక్కనుందని అంటున్నారు. ఇతర నటులు కొందరు ఇంత కంటే ఎక్కువ చిత్రాల్లో నటించినా.. అన్ని చిత్రాల్లో డ్యాన్స్ చేయలేదనీ అంటున్నారు. ఈ విషయంలోనే చిరూకు గిన్నిస్ రికార్డు దక్కనుందని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయంపై ఈవెంట్ తర్వాతే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ ఏడాది మొదట్లోని దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‍ను మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయానికొస్తే ఆయన వశిష్ట దర్శకత్వంలో విశ్వంభరా అనే సినిమా చేస్తున్నారు.. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా పదో తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Exit mobile version