NTV Telugu Site icon

Aaliya Nawazuddin: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన నవాజుద్దీన్ భార్య.. మరో వ్యక్తితో ఎఫైర్?

Aaliya Siddiqui

Aaliya Siddiqui

Aaliya Nawazuddin Shared Her Boyfriend Pic On Instagram: బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, అతని భార్య ఆలియా మధ్య కొనసాగుతున్న వివాదం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. విడాకులు, ఆస్తుల విషయంలో వీరి మధ్య కొంతకాలం నుంచి గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా.. అతని భార్య అయితే నవాజుద్దీన్ ఇంటి బయటే తన పిల్లల్ని తీసుకొని చాలా హంగామా చేసింది. తనని, తన పిల్లల్ని అన్యాయంగా రోడ్డులో వదిలేశాడంటూ వాపోయింది. తమను ఇంట్లోకి రానివ్వకుండా, బజారులో పడేశాడనంటూ రచ్చ చేసింది. తనతో పాటు పిల్లల్ని ఇంట్లోకి రానివ్వాలంటూ డిమాండ్ చేసింది. అంతేకాదు.. నవాజ్‌పై మరెన్నో నిందారోపణలు చేసిన ఆమె, తనకు న్యాయం జరిగే వరకూ పోరాడుతానని పేర్కొంది. అలాంటి ఆలియా ఇప్పుడు ఓ సడెన్ ట్విస్ట్ ఇచ్చింది. తానూ ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నానంటూ కుండబద్దలు కొట్టింది.

Sanya Malhotra: ఆడిషన్స్‌కు వెళ్తే ఆ మాట చెప్పారు.. దంగల్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

‘‘ఒక బంధం నుంచి బయటపడేందుకు నాకు 19 ఏళ్లు పట్టింది. నిజానికి.. ఆ బంధానికి నేనెంతో విలువ ఇచ్చాను కానీ, అక్కడ నాకే విలువ లేకుండా పోయింది. అయితే.. నా జీవితంలో అందరికంటే నా పిల్లలకే నేను తొలి ప్రాధాన్యత ఇస్తాను. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. ఏదేమైనా.. కొన్ని బంధాలు ఇవి స్నేహం కన్నా ఎక్కువైనవి. ప్రస్తుతం నేను అదే బంధంలో మునిగి తేలుతున్నాను. అందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అందుకే, ఈ ఆనందాన్ని మీతో పంచుకుంటున్నాను. అందరిలాగా నాకు ఆనందంగా ఉండే హక్కు లేదా’’ అంటూ ఆలియా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఓ సుదీర్ఘమైన పోస్టు రాసుకొచ్చింది. అంతేకాదు.. తన కొత్త భాగస్వామితో కలిసి దిగిన ఫోటోను సైతం షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు ‘‘ఇకపై నీ జీవితప్రయాణం సుఖసంతోషాలతో సాగాలని కోరుకుంటున్నాము’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Mother Dead Body: పింఛన్ డబ్బుల కోసం ఆరేళ్ల పాటు తల్లి శవంతోనే గడిపిన కొడుకు

Show comments