ఆది సాయికుమార్ ఇటీవల చేసిన సినిమాలేవీ తెలుగు ప్రేక్షకులను మెప్పించకపోయాయి. అయినప్పటికీ వరుస ప్రాజెక్టులతో బాక్సాఫీస్ సక్సెస్ కోసం ట్రై చేస్తున్న ఈ యంగ్ హీరో ఖాతాలో మరో మూవీ పడింది. తాజాగా ఆది సాయికుమార్ కొత్త సినిమాపై అధికారిక ప్రకటన వచ్చింది. కొత్త దర్శకుడు ఫణి కృష్ణ దర్శకత్వంలో ఆది హీరోగా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రూపొందనుంది. ఈ ప్రాజెక్ట్ ను తాజాగా అధికారికంగా ప్రకటించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రొడక్షన్ లో ప్రముఖ సీనియర్ నిర్మాత కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి ధృవన్ సంగీత దర్శకుడు. జి సత్య ఈ చిత్రానికి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.
Read Also : Bheemla Nayak Hindi Trailer : బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాల్సిందే !
ఈరోజు నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ.. ‘అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అద్భుతమైన కథతో ఫణికృష్ణ నన్ను సంప్రదించారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఆది సాయికుమార్ సబ్జెక్ట్‌కి సరిగ్గా సరిపోతారని అన్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ చిత్రానికి సరైన నటీనటులు, సాంకేతిక సిబ్బందిని సెట్ చేశాము. అన్ని వర్గాల ప్రేక్షకులను తీర్చగల సామర్థ్యం ఉన్న ఒక విజయవంతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తామన్న నమ్మకంతో ఉన్నాం’ అని అన్నారు.