Site icon NTV Telugu

Aadhi Pinisetty – Nikki Galrani : హీరో హీరోయిన్ సీక్రెట్ ఎంగేజ్మెంట్… ఫోటోలు వైరల్

Adi-Pinishetty

Aadhi Pinisetty – Nikki Galrani ఎంగేజ్మెంట్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. చాలా కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్న కోలీవుడ్ సెలెబ్రిటీ కపుల్ ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నారు. చాలా కాలంగా వీరిద్దరి రిలేషన్షిప్ గురించి కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. హీరోయిన్ నిక్కీ… ఆది ఫ్యామిలీతో సన్నిహితంగా మెలుగుతుండడం పలు అనుమానాలకు తావిచ్చింది. కానీ ఇప్పటి వరకూ ఆ రూమర్లపై ఎలాంటి క్లారిటీ ఇవ్వని ఆది, నిక్కీ ఇప్పుడు ఏకంగా ఎంగేజ్మెంట్ చేసుకుని కన్పించారు.

Read Also : Sai Dharam Tej : ఎట్టకేలకు బయటకొచ్చిన హీరో… గుడ్ న్యూస్ చెప్తూ స్పెషల్ వీడియో

సమాచారం ప్రకారం వీరిద్దరి ఎంగేజ్మెంట్ మార్చ్ 24న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగింది. అయితే ఈ వేడుక జరిగి రెండు రోజులైనప్పటికీ సీక్రెట్ గానే ఉంచారు ఈ జంట. కానీ తాజాగా నిక్కీ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఎంగేజ్మెంట్ విషయాన్ని వెల్లడించింది. “మేము కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమలో పడ్డాము. ఇది ఇప్పుడు అధికారికం… 24.3.22 మాకు నిజంగా ప్రత్యేకం. మేము కలిసి ఈ కొత్త ప్రయాణంలో మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు కోరుతూ మా ఇద్దరి కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నాము” అంటూ ఆదితో ఎంగేజ్మెంట్ అయిన విషయాన్నీ ప్రకటించేసింది. అంతేకాదు ఆ ఆనందకరమైన క్షణాలు సంబంధించిన పిక్స్ ను కూడా షేర్ చేసింది. ఇక త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు కూడా ఎక్కనుంది. కాగా ఇటీవలే ‘క్లాప్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అది పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ప్రస్తుతం రామ్ పోతినేని “ది వారియర్” సినిమాలో ఆది విలన్ గా నటిస్తున్నాడు.

Exit mobile version