Aadarsha Kutumbam Trailer: ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్లో వెంకీ మామ వైలెంట్ అవతార్ చూశారా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aadarsha Kutumbam Trailer: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అనగానే అందరికీ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ లేదా కడుపుబ్బా నవ్వించే కామెడీ గుర్తుకొస్తుంది. కానీ, తాజాగా రిలీజ్ అయిన ‘ఆదర్శ కుటుంబం (ఏకే-47)’ అఫీషియల్ ట్రైలర్ చూసిన తర్వాత సినీ ప్రియుల మైండ్ బ్లాంక్ అవుతోంది. టైటిల్ క్లాస్‌గా కనిపిస్తున్నా.. కంటెంట్ మాత్రం అంతకుమించిన క్రైమ్, వైలెన్స్‌తో నిండిపోయి థ్రిల్లింగ్ అనుభూతిని ఇస్తోంది.
ట్రైలర్ ప్రారంభంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలు, సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యంపై వెంకీ వేసే క్లాసిక్ త్రివిక్రమ్ మార్క్ పంచ్‌లతో సరదాగా మొదలవుతుంది. “మిడిల్ క్లాస్ వాళ్ల దగ్గర అమ్మడానికి ఆస్తి ఉండదు, కొనడానికి డబ్బులుండవు.. లేదని ఒప్పుకోవడానికి మొహమాటం, ఉందని చెప్పుకోవడానికి పరువు తప్ప” అంటూ సాగే డైలాగులు అలరిస్తాయి. అయితే తర్వాత కథ ఒక్కసారిగా ఊహించని మలుపు తిరుగుతుంది. ఒక భారీ నేర సామ్రాజ్యం, హత్యలు, దొంగతనాల చుట్టూ ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది.
Also Read
అక్కడ నుంచి ట్రైలర్ అసలైన వైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. “ఒక మనిషి మృగంగా మారడం అనేది ఒక ప్రాసెస్.. ఒక ఎవల్యూషన్” అంటూ వెంకటేష్ చెప్పే డైలాగ్ గూస్బంప్స్ తెప్పిస్తోంది. చేతిలో కత్తి పట్టుకుని నెత్తుటి మరకలతో శత్రువులను వేటాడుతున్న వెంకీ మామ రౌద్ర రూపం మునుపెన్నడూ చూడని రీతిలో ఉంది. “పెళ్లాన్ని కళ్లముందే కొడుతుంటే మొగుడికి ఎలా ఉంటుందో తెలుసా.. ఒక్క చేత్తో భూమిని తలకిందులు చేయాలనిపిస్తుంది”, “జైలు నాకు కొత్త కాదు.. నా కుటుంబమే నాకు ముఖ్యం” అంటూ ఆయన ఇచ్చే ఎమోషనల్ వార్నింగ్స్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి. చివర్లో “ఆరు నెలల క్రితం నువ్వు చేసిన తప్పు ఆరడుగుల షేప్ తీసుకుంటే.. అది నేను” అంటూ వెంకీ ఇచ్చే ముగింపు ట్రైలర్లో హైలెట్‌గా నిలిచింది. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. ఈ క్రైమ్, బ్లాక్ కామెడీ థ్రిల్లర్ అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది.
తాజావార్తలు
-
Aadarsha Kutumbam Trailer: ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్లో వెంకీ మామ వైలెంట్ అవతార్ చూశారా!
-
DGP Harish Kumar Gupta: “హింసకు పాల్పడితే ఉపేక్షించేది లేదు”.. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై డీజీపీ హెచ్చరిక
-
India-China Border: భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత.. విదేశాంగ శాఖ కీలక ప్రకటన.!
-
Thaman: త్రివిక్రమ్ వల్లే ‘ఓజీ’ సాధ్యమైంది: మ్యూజిక్ డైరెక్టర్ తమన్
-
Trivikram: ఈసారి రొటీన్ కథ కాదు.. వెంకీతో కలిసి సరికొత్త ప్రయోగం చేశా
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!