AAA Cinemas Officially Launched: ఒకపక్క సినిమా హీరోగా రాణిస్తూ ఐకాన్ స్టార్ గా మారి ప్యాన్ ఇండియా క్రేజ్ దక్కించుకున్న అల్లు అర్జున్ మరోపక్క పలు వ్యాపారాలు కూడా చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే పలు రెస్టారెంట్లు నడుపుతున్న ఆయన ఏషియన్ సినిమాస్ తో కలిపి ఒక మల్టీప్లెక్స్ కి కూడా ఓనర్ అయ్యారు.
ఇక ఈ మల్టీప్లెక్స్ లో మొత్తం ఐదు థియేటర్లు ఉన్నాయి. రెండు థియేటర్లు ఎక్కువ సీటింగ్ కెపాసిటీ కలిగినవి కాగా మూడు థియేటర్లు మాత్రం కాస్త తక్కువ సీటింగ్ కెపాసిటీ కలిగినవి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే హైదరాబాదులో ఇప్పటివరకు లేనివిధంగా ఒక ఎల్ఈడీ స్క్రీన్ ను కూడా ఏఏఏ సినిమాస్ లో ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఈరోజు ఓపెనింగ్ జరగడంతో రేపు ఆదిపురుష్ సహా పలు సినిమాల బుకింగ్స్ గట్టిగా జరుగుతున్నాయి.