స్టార్ కిడ్స్‌ను ధర్మ ప్రొడక్షన్స్ వదలనట్లు, కృతి సనన్‌ను పెంచిపోషిస్తోంది మరో బడా ప్రొడక్షన్ హౌస్ మడాక్ ఫిల్మ్స్. 2017లో రబ్తాతో మొదలైన దినేష్ విజన్, కృతి బాండింగ్ స్టిల్ కంటిన్యూ అవుతోంది. తొలి సినిమా ఫ్లాపైన కృతిని వదల్లేదు మడాక్. వరుస ఆఫర్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తోంది. ఇప్పటి వరకు ఈ కాంబోలో ఆరు సినిమాలు, టూ, త్రీ సిరీస్ చేసింది. నెక్ట్స్ వీరి కాంబోలో కాక్ టైల్2 జూన్ 19న రాబోతుంది. రాబోయే సినిమాలలో కూడా కృతినే హీరోయిన్ గా ఉండే ఛాన్స్ ఉంది.
నేషనల్ క్రష్ రష్మిక కూడా సదరు నిర్మాణ సంస్థతో ఫ్రెండ్ షిప్ బిల్ట్ చేసుకుంటోంది. ఛావాతో మొదలైన ఈ బాండింగ్..థమాతో బలపడి.. కాక్ టైల్2 వరకు వచ్చింది. ఛావా బ్లాక్ బస్టర్ హిట్ కాగా, థమా ఓకే అనిపించుకుంది. కాక్ టైల్2తో మరో హిట్ చూసి.. మడాక్‌కు లక్కీ హీరోయిన్ అయిపోదామనుకుంటోంది రష్మిక దేవరకొండ. బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్‌తో రిలేషన్ మరింత పెద్దది చేసుకోబోతుంది రష్మిక. భర్త విజయ్ దేవరకొండను రంగంలోకి దింపినట్లుంది. ఆ మధ్య మడాక్ ఆఫీస్‌కు డైరెక్టర్ విక్రమ్ కుమార్‌తో కలిసి వచ్చాడు రౌడీ బాయ్. దీంతో ఈ కొలబరేషన్ సెట్ కాబోతుందని వార్తలు వచ్చాయి. విజయ్‌తో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తీసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇలా అటు కృతి, ఇటు రష్మికను లాక్ చేసి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతోంది మడాక్ ఫిల్మ్స్.

