NTV Telugu Site icon

A.S Ravi Kumar: తాగి వాగితే ఊరుకుంటారా.. తాట తీశారు.. గోపీచంద్ ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పిన డైరెక్టర్

Gopcihand

Gopcihand

A.S Ravi Kumar:సీనియర్ డైరెక్టర్ AS రవికుమార్ పేరు గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న విషయం తెల్సిందే, దాదాపు పదేళ్ల తరువాత తిరగబడరాసామీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రాజ్ తరుణ్, మన్నార్ చోప్రా జంటగా నటించిన ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ప్రమోషన్స్ లో భాగంగానే ఒక ప్రెస్ మీట్ లో రవికుమార్ .. మన్నార్ చోప్రాను స్టేజిమీదనే.. అందరు చూస్తుండగా ముద్దు పెట్టి వివాదాలను కొనితెచ్చుకున్నాడు. ఇక ఆ వివాదంపై క్లారిటీ ఇవ్వడానికి ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది.. హీరో గోపీచంద్ పై అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడి మరింత ట్రోల్ కు గురి అయ్యాడు. “వాడిని హీరోను చేసింది నేనే.. ఒకప్పుడు విలన్ వేషాలు వేసుకొని బతికేవాడు.. మాతో కలిసి చెట్టు కింద కలిసి తినేవాడు.. ఏరా .. ఇప్పుడు నీకు బాగా బలిసింది కదా.. నిన్ను నేను చూడాలంటే ఐదుగురును దాటుకొని రావాలా.. ? .. గతంలో నా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా వచ్చావ్ .. ఇప్పుడు నేను వచ్చాను అని చెప్తే.. వెయిట్ చేయమని చెప్తావా.. ?. ఒకప్పుడు నా సినిమాతో ఎదిగినవాడు ఇప్పుడు బలుపు ఎందుకు వచ్చిందో అర్ధం కావడం లేదు.” అంటూ తిట్టిపోశాడు.

A.S. Ravi Kumar Chowdary: ఏరా.. గోపీచంద్.. అంత బలిసిందారా నీకు.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

ఇక ఈ వ్యాఖ్యలపై గోపీచంద్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు.. రవికుమార్ కు ఫోన్ చేసి.. తాగి వాగింది కాకుండా.. ఇంకా మా హీరోపైనే నిందలు వేస్తావా.. ? ఇలా తాగి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎవరు నీకు అవకాశాలు ఇస్తారు.. వెంటనే గోపీచంద్ ను అన్న మాటలను వెనక్కి తీసుకో .. లేకపోతే మాములుగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చారట. ఇక దీంతో తాజా ఇంటర్వ్యూలో రవికుమార్ దెబ్బకు దిగివచ్చాడు. గోపీచంద్ ను అలా తిట్టడం తాను చేసిన తప్పు అని ఒప్పుకున్నాడు.” గోపీచంద్ నా బిడ్డలాంటి వాడు.. నా తమ్ముడు.. ఏదో ఆవేదనలో ఆ మాటలు అనేశాను.. గోపీచంద్ ఫ్యాన్స్ ను క్షమించమని అడుగుతున్నాను. అతనికి, నాకు ఎలాంటి గొడవలు లేవు.. క్షమించండి” అని చెప్పుకొచ్చాడు. ఇక దీంతో తాగి వాగితే ఊరుకుంటారా.. తాట తీశారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.