A.R Rahman: లైవ్‌లో రెహమాన్ గూస్‌బంప్స్.. ఆగలేకపోతున్నాం మావా!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A.R Rahman Live Performance Video with Mano Goes Viral: ఇప్పుడంటే కాస్త రేసులో వెనకబడిపోయారు కానీ, ఒకప్పటి ఏ.ఆర్. రెహమాన్ వేరే. అసలు రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు అంటే చాలు.. ఆ సినిమా హిట్ అయినట్టే. ముఖ్యంగా శంకర్ లాంటి డైరెక్టర్‌తో రెహమాన్ చేసిన మ్యూజిక్ అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. ఇక ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమాతో ఆస్కార్ కొట్టి.. తన సంగీతాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన రెహమాన్.. గత కొంత కాలంగా ఆశించిన స్థాయిలో సంగీతం అందించలేకపోతున్నారు. దీంతో.. ఇక రెహమాన్ పనైపోయినట్టేనని అనుకున్నారు. ఇలాంటి సమయంలో.. రెహమాన్ కొడితే ఎలా ఉంటుందో ‘రాయన్’ సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది. ధనుష్ హీరోగా తెరకెక్కిన ‘రాయన్’ సినిమాలో.. రెహమాన్ సెకండ్ హీరోగా నిలిచారు. అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో థియేటర్లో గూస్ బంప్స్ తెప్పించాడు. అయితే.. రాయన్ థియేటర్లోనే కాదు.. లైవ్‌లో కూడా రోమాలు నిక్కబొడిచేలా చేశాడు ఈ మ్యూజిక్ లెజెండరీ. రాయన్ సినిమాలోని ‘ఉసురే నీదానే..’ అనే పాట చాల పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఇదే పాటను.. సింగపూర్ మ్యూజిక్ కాన్సర్ట్‌లో ఆలపించారు రెహమాన్.
Tamannaah : పెళ్లిపై బాంబు పేల్చిన తమన్నా
Also Read
ఈ వేదిక పై సింగర్ మనోతో కలిసి ఈ పాట పాడి అలరించాడు. అయితే.. మనో ఈ సాంగ్ పాడుతుండగా.. ఎఆర్. రెహమాన్ మధ్యలో గ్యాప్ తీసుకోమని చెబుతాడు. దీంతో.. అసలేం జరుగుతుందో ‘మనో’కి కూడా అర్థం కాదు. రెహమాన్ అలా చేయడంతో.. ఆడిటోరియం అంతా గోలతో దద్దరిల్లిపోయింది. కానీ ఒక్కసారిగా రెహమాన్ ‘ఉసురే నీదానే..’ అని పాడడంతో.. అక్కడున్న వారికే కాదు.. ఈ వీడియో చూసిన వారికి కూడా గూస్‌బంప్స్ గ్యారెంటీ. ఈ మూమెంట్ సింగపూర్ ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియోను రెహమాన్ ఎక్స్ వేదికగా షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక రాయన్‌తో అదరగొట్టిన రెహమాన్.. నెక్స్ట్ తెలుగులో రామ్ చరణ్, బుచ్చిబాబు ‘ఆర్సీ 16’ ప్రాజెక్ట్‌కి వర్క్ చేస్తున్నాడు. ఈ సినిమాకు రెహమాన్ మ్యూజిక్ అనగానే.. అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో చరణ్ అభిమానులు ఆగలేకపోతున్నాం మావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆర్సీ16తో రెహమాన్ తన మ్యూజిక్‌తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.
Dear Singapore,
Thank you and Until then see you next time . pic.twitter.com/EZq0DErUGR
— A.R.Rahman (@arrahman) September 3, 2024
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!