NTV Telugu Site icon

A.R Rahman: లైవ్‌లో రెహమాన్ గూస్‌బంప్స్.. ఆగలేకపోతున్నాం మావా!!

Ar Rahman

Ar Rahman

A.R Rahman Live Performance Video with Mano Goes Viral: ఇప్పుడంటే కాస్త రేసులో వెనకబడిపోయారు కానీ, ఒకప్పటి ఏ.ఆర్. రెహమాన్ వేరే. అసలు రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు అంటే చాలు.. ఆ సినిమా హిట్ అయినట్టే. ముఖ్యంగా శంకర్ లాంటి డైరెక్టర్‌తో రెహమాన్ చేసిన మ్యూజిక్ అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. ఇక ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమాతో ఆస్కార్ కొట్టి.. తన సంగీతాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన రెహమాన్.. గత కొంత కాలంగా ఆశించిన స్థాయిలో సంగీతం అందించలేకపోతున్నారు. దీంతో.. ఇక రెహమాన్ పనైపోయినట్టేనని అనుకున్నారు. ఇలాంటి సమయంలో.. రెహమాన్ కొడితే ఎలా ఉంటుందో ‘రాయన్’ సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది. ధనుష్ హీరోగా తెరకెక్కిన ‘రాయన్’ సినిమాలో.. రెహమాన్ సెకండ్ హీరోగా నిలిచారు. అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో థియేటర్లో గూస్ బంప్స్ తెప్పించాడు. అయితే.. రాయన్ థియేటర్లోనే కాదు.. లైవ్‌లో కూడా రోమాలు నిక్కబొడిచేలా చేశాడు ఈ మ్యూజిక్ లెజెండరీ. రాయ‌న్ సినిమాలోని ‘ఉసురే నీదానే..’ అనే పాట చాల పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఇదే పాటను.. సింగ‌పూర్ మ్యూజిక్ కాన్సర్ట్‌లో ఆలపించారు రెహమాన్.

Tamannaah : పెళ్లిపై బాంబు పేల్చిన తమన్నా

ఈ వేదిక‌ పై సింగ‌ర్ మ‌నోతో క‌లిసి ఈ పాట పాడి అల‌రించాడు. అయితే.. మ‌నో ఈ సాంగ్ పాడుతుండగా.. ఎఆర్. రెహమాన్ మ‌ధ్య‌లో గ్యాప్ తీసుకోమని చెబుతాడు. దీంతో.. అసలేం జరుగుతుందో ‘మనో’కి కూడా అర్థం కాదు. రెహమాన్ అలా చేయడంతో.. ఆడిటోరియం అంతా గోలతో దద్దరిల్లిపోయింది. కానీ ఒక్కసారిగా రెహమాన్ ‘ఉసురే నీదానే..’ అని పాడడంతో.. అక్కడున్న వారికే కాదు.. ఈ వీడియో చూసిన వారికి కూడా గూస్‌బంప్స్ గ్యారెంటీ. ఈ మూమెంట్ సింగపూర్ ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియోను రెహమాన్ ఎక్స్ వేదిక‌గా షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక రాయన్‌తో అదరగొట్టిన రెహమాన్.. నెక్స్ట్ తెలుగులో రామ్ చరణ్, బుచ్చిబాబు ‘ఆర్సీ 16’ ప్రాజెక్ట్‌కి వర్క్ చేస్తున్నాడు. ఈ సినిమాకు రెహమాన్ మ్యూజిక్ అనగానే.. అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో చరణ్ అభిమానులు ఆగలేకపోతున్నాం మావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆర్సీ16తో రెహమాన్ తన మ్యూజిక్‌తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.

Show comments