Site icon NTV Telugu

TFC : తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం

Tfcc

Tfcc

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో తెలుగు సినిమా దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నటులు మురళీమోహన్ , రచయిత పరిచూరి గోపాలకృష్ణ, ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, సెక్రటరీ ప్రసన్న కుమార్, దర్శకుల సంఘం అధ్యక్షులు వీర శంకర్, రచయిత జర్నలిస్ట్ రెంటాల జయదేవ్ తదితరులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 6ను తెలుగు సినిమా దినోత్సవంగా ప్రకటించింది ఛాంబర్.

Also Read : Thaman : తలసేమియా బాధితులకు సహాయార్ధం ‘తమన్’ యుఫోరియా మ్యూజికల్ నైట్

మురళీమోహన్ కామెంట్స్ మాట్లాడుతూ ‘ రాజకీయ నాయకులకంటే సినిమా వాళ్లకే ప్రజల్లో ఆదరణ ఎక్కువ. రాజకీయ నాయకుడు పదవికాలం పూర్తయ్యాక ప్రజల్లో ఆదరణ ఉండదు. క్రీడాకారులకు కూడా ఆదరణ అంతంత మాత్రమే. కానీ సినీ నటులు మాత్రం ఎప్పుడు ప్రేక్షకుల హృదయాల్లో ఉంటారు. ఫిబ్రవరి 6న తెలుగు సినిమా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉంది. మద్రాసులో ఉన్నప్పుడు మేం సినిమా కులమని గర్వంగా చెప్పుకునేవాళ్లం అని అన్నారు.

Also Read : Shekar Bhasa : బిగ్ బాస్ ఫేమ్ RJ శేఖర్ బాషా పై నార్సింగి పీస్ లో మరో కేసు నమోదు

ఈ కార్యక్రమంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై ప్రతి సంవత్సరం ఛాంబర్ నుంచి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 6 తెలుగు సినిమా పుట్టిన రోజు వేడుకల్లోనే అవార్డులు ఇవ్వాలని నిర్ణయం చేసారు. ప్రభుత్వం ఇచ్చే అవార్డులతో పాటు ఫిల్మ్ ఛాంబర్ నుంచి అవార్డులు ఉంటాయని తెలిపారు. తెలుగు సినిమా పుట్టినరోజున ప్రతి సినిమా నటుడు ఇంటిపై, థియేటర్ల వద్ద ప్రత్యేకంగా జెండా ఆవిష్కరించాలని, తెలుగు సినిమా పుట్టినరోజు జెండా రూపకల్పన బాధ్యతను పరిచూరి గోపాలకృష్ణకు అప్పగించింది ఫిల్మ్ ఛాంబర్.

Exit mobile version