Prabhas: ఆ భారీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లేనా…
ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రభాస్ ఆదిపురుష్ హంగామానే కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఆదిపురుష్ ట్రైలర్ టాక్ ఓ రేంజ్‌లో వినిపిస్తోంది, టీజర్ చూసి కామెంట్స్ చేసిన వాళ్లే ఇప్పుడు పాజిటివ్ టాక్ ని స్ప్రెడ్ చేస్తున్నారు. సోషల్ మీడియా అంతా ప్రభాస్ ఫాన్స్ హంగామా నడుస్తున్న సమయంలో ప్రభాస్ లైనప్ లో ఉన్న ఓ భారీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందనే టాక్ బాలీవుడ్ మీడియాలో వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్, భారీ బడ్జట్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, మారుతితో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. అలాగే అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ మూవీ కమిట్ అయ్యాడు. ఇప్పటికే స్పిరిట్ మూవీ అఫీషియల్ గా అనౌన్స్ కూడా అయ్యింది. రణబీర్ కపూర్ తో సందీప్ రెడ్డి వంగ చేస్తున్న ‘అనిమల్’ షూటింగ్ అయ్యాక ‘స్పిరిట్’ వర్క్స్ కూడా స్టార్ట్ అవ్వనున్నాయి. ఈ ప్రాజెక్ట్స్ తో పాటు ప్రభాస్ ఒక స్ట్రెయిట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా కమిట్ అయ్యాడు. ఇటీవలె షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీతో సాలిడ్ హిట్ అందుకున్న డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తో ప్రభస్ సినిమా ఉంటుందని వార్తలు చాలా కాలంగా వినిపిస్తూనే ఉన్నాయి.
ఈ ప్రాజెక్ట్‌ను టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నట్టు ఇప్పటికే అఫీషియల్ గా క్లారిటీ కూడా ఇచ్చేశారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందనే న్యూస్ బాలీవుడ్ లో వినిపిస్తోంది. దానికి కారణం ప్రభాస్, సిద్దార్థ్‌లకు డేట్స్ కుదరకపోవడమేనని అంటున్నారు. ప్రజెంట్ ప్రభాస్ లైనప్ ఎంత టైట్ గా ఉందో, సిద్ధార్థ్ ఆనంద్ పరిస్థితి కూడా అంతే. ‘ఫైటర్’, ‘టైగర్ వర్సెస్ పఠాన్’ లతో సిద్ధార్థ్ బిజీగా ఉన్నాడు. యష్ రాజ్ స్పై యూనివర్స్ నుంచి సిద్దార్థ్ ఆనంద్ మరో మూడేళ్ల వరకూ బయటకి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఈ కారణంగా సిద్ధార్థ్ ఆనంద్-ప్రభాస్ ల కాంబినేషన్ ఇప్పట్లో వర్కౌట్ అయ్యేలా కనిపించట్లేదు. ఇప్పుడు సెట్ అవ్వట్లేదు కానీ ఫ్యూచర్లో ఈ కాంబినేషన్ ఖచ్చితంగా ఉంటుందట.
Also Read
- Paranormal Activity: పెట్టింది రూ.12 లక్షలు.. కొల్లగొట్టింది రూ.16 వేల కోట్లు! సినిమా చరిత్రలోనే అతిపెద్ద మిరాకిల్..
- Yash Toxic: 4 ఏళ్ల తర్వాత థియేటర్స్‌లోకి రాబోతున్న రాకింగ్ స్టార్.. యష్ 'టాక్సిక్' రిలీజ్ అప్పుడేనా?
- Payal Rajput Lover హీరోగా సినిమా.. ఆరోజే రిలీజ్
- JD Chakravarthy: అదే మలయాళ సినిమాలు మనవాళ్లు తీస్తే చూడరు.. జేడీ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..
-
Easy Laundry Tricks: కాలర్ మొండి మరకలను సింపుల్‌గా వదిలించే సూపర్ టిప్స్!
-
IPL Playoff Chance: ప్లే ఆఫ్స్ చేరే జట్లపై క్లారిటీ.. ఆ రెండు జట్లు ఔట్..!
-
LSG vs KKR: టాస్ గెలిచిన లక్నో.. ప్రతీకారం తీర్చుకునేందుకు సై..
-
Donald Trump: ‘‘మీకే ఎందుకు ఇలా జరుగుతోంది.?’’ కాల్పుల ఘటనపై ట్రంప్ ‘‘లింకన్’’ ఆన్సర్..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!