NTV Telugu Site icon

Balakrishna: ముగ్గురు డైరెక్టర్లు – 300 కోట్లు… బాలయ్య హ్యాట్రిక్

Balakrishna

Balakrishna

A Hat-trick 100 Crore Grossing films for Nandamuri Balakrishna at the box office: నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన భగవంత్ కేసరి సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వరుసగా మూడు సినిమాలతో 100 కోట్లు వసూళ్లు సాధించి నందమూరి బాలకృష్ణ మంచి జోష్ లో కనిపిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 100 కోట్లు పైగానే వసూలు చేసి నందమూరి బాలకృష్ణ కెరియర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఆ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన వీర సింహారెడ్డి సినిమా సైతం భారీ ఎత్తున వసూలు చేసి దాదాపు 100 కోట్లు కలెక్షన్స్ క్రాస్ చేయడమే కాదు నందమూరి బాలకృష్ణ కెరియర్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది.

Bhagavanth Kesari: మొత్తానికి బాలయ్య సెంచరీ కొట్టాడు..

ఇక ఈ ఏడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఉన్న నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన భగవంత్ కేసరి సినిమా కూడా సూపర్ హిట్ గా నిలవడం మాత్రమే కాదు కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసినట్లు అధికారిక ప్రకటన చేశారు సినిమా యూనిట్. ఈ రకంగా చూసుకుంటే నందమూరి బాలకృష్ణ వరుసగా మూడు సినిమాలతో హ్యాట్రిక్ 100 కోట్లు కలెక్షన్స్ కొల్లగొట్టాడు అంటూ నందమూరి బాలకృష్ణ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.. అంతే కాదు దసరాకి రిలీజ్ అయిన భగవంత్ కేసరి సినిమా దసరా విన్నర్ అని కూడా సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.