Agent: పాన్ ఇండియా టాలెంట్ ని ఒక యూనివర్స్ గా మార్చబోతున్న అఖిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసుడిగా ఇండస్ట్రీలోకి ఇచ్చిన హీరో అఖిల్ అక్కినేని రెండేళ్ల గ్యాప్ ఇచ్చి ‘ఏజెంట్’ సినిమాతో ఈ సమ్మర్ లో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ గా పేరున్న డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీతో అఖిల్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చెయ్యబోతున్నాడు. ఇప్పటికే గ్లిమ్ప్స్, సాంగ్స్, పోస్టర్స్ తో అంచనాలు పెంచుతున్న మేకర్స్ ‘ఏజెంట్’ సినిమాని అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నారు. వైల్డ్ రైడ్ గా ఉండబోతున్న ఏజెంట్ సినిమాని పాన్ ఇండియా సినిమా చేస్తే సరిపోదు, పాన్ ఇండియా స్థాయిలో కూడా ప్రమోషన్స్ చెయ్యాలి అప్పుడే మార్కెట్ క్రియేట్ అవుతుంది. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, అడవి శేష్, నాని, నిఖిల్ సిద్దార్థ్, యష్, రిషబ్ శెట్టి… ఇలా పాన్ ఇండియా సినిమా చేసిన ఏ హీరో అయినా సరే పాన్ ఇండియా మార్కెట్ కావాలి అంటే పాన్ ఇండియా మొత్తం తిరిగిన వారే. అఖిల్ ఏమో ఇంట్రోవర్ట్, ఎక్కువగా బయట కనిపించడు, మాట్లాడాడు… కామ్ గా ఉంటాడు. ఇలాంటి టైంలో ఏజెంట్ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చెయ్యడం అనేది బిగ్గెస్ట్ టాస్క్ అనే చెప్పాలి. అయితే తన సినిమా కోసం అఖిల్ ఎట్టకేలకు బయటకి రాబోతున్నాడు. ఇటివలే ట్విట్టర్ లో అఖిల్, అక్కినేని ఫాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యాడు.
ఫిబ్రవరి 22న అఖిల్ ట్విట్టర్ స్పేస్ లో ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయిన అఖిల్, లేటెస్ట్ గా ఇన్ఫ్లుయెన్సర్స్ ని మీట్ కాబోతున్నాడు. ఇండియాలో ఉన్న ప్రతి టాలెంటెడ్ ఇన్ఫ్లుయెన్సర్ ని మీట్ అవ్వనున్న అఖిల్, ముందెన్నడూ లేని విధంగా ఇన్ఫ్లుయెన్సర్స్ యూనివర్స్ ని క్రియేట్ చెయ్యబోతున్నాడు. ఇన్ఫ్లుయెన్సర్ అందరినీ ఒక దగ్గరికి చేర్చి వారితో అఖిల్ ఇంటరాక్ట్ అవ్వనున్నాడు.ఏకే ఎంటర్టైన్మెంట్స్, శ్రేయాస్ మీడియా, జోన్ కలిసి చేస్తున్న ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ మీటింగ్ తో ఏజెంట్ సినిమా ప్రమోషన్స్ పీక్ స్టేజ్ కి చేరనున్నాయి. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ మీటింగ్ గురించి మరిన్ని వివరాలు త్వరలో అనౌన్స్ చేస్తామని మేకర్స్ ట్వీట్ చేశారు. మరి ఏప్రిల్ 28న ఆడియన్స్ ముందుకి రానున్న ఏజెంట్ మూవీ అఖిల్ కి పాన్ ఇండియా హీరో ఇమేజ్ ఇస్తుందో లేదో చూడాలి.
Also Read
Taking over INDIA🇮🇳 with
A FIRST OF ITS KIND #InfluencersUniverse 💫@AKentsOfficial & @shreyasgroup powered by @CZONE360 Bringing the nation's incredible influencers talent under one roof for #AGENT 🤟Stay Tuned ✨@AkhilAkkineni8 @AnilSunkara1#AgentOnApril28th pic.twitter.com/G70maa6D2t
— AK Entertainments (@AKentsOfficial) March 27, 2023
తాజావార్తలు
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!