NTV Telugu Site icon

Hanu Man: ఓరీ మీ దుంపతెగ ఇలా తయారయ్యారెంట్రా?

Hanuman

Hanuman

సోషల్ మీడియాని హీరోల అభిమానులు వాడినట్లు ఇంకొకరు వాడట్లేదేమో. సినిమా అనౌన్స్మెంట్ నుంచి ప్రమోషనల్ కంటెంట్ ట్విట్టర్ లోనే కనిపిస్తూ ఉండడంతో స్టార్ హీరో ఫాన్స్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఒకవేళ తమకి నచ్చిన హీరో సినిమా నుంచి అప్డేట్ రాకపోతే అప్డేట్ కావాలి, అప్డేట్ ఇవ్వండి, పడుకున్నారా మేలుకోండి, ప్రమోషన్స్ చెయ్యాలనే ఆలోచన లేకుంటే సినిమా ఎందుకు చేస్తున్నారు, థియేటర్స్ కౌంట్ పెంచండి, ఈ దర్శకుడితో సినిమా వద్దు, ఆ మ్యూజిక్ డైరెక్టర్ ని మార్చండి, ఆ అమ్మాయి హీరోయిన్ అయితే బాగుంటుంది, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ రేంజులో ఉంటే అదిరిపోతుంది… వాట్ నాట్ ఒక సినిమాకి సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని ట్విట్టర్ లో ట్రెండ్ చేసి మరీ అడుగుతున్నారు హీరో అభిమానులు. ఒకప్పుడు పాజిటివ్ ట్రెండ్ చేసే ఫాన్స్ ఇప్పుడు నెగటివ్ ట్రెండ్స్ కూడా చేసి మేకర్స్ కి చుక్కలు చూపిస్తున్నారు. ఇలాంటి సిట్యువేషన్ నే ఫేస్ చేశాడు యంగ్ హీరో తేజ సజ్జా.

‘జాంబీ రెడ్డి’, ‘అద్భుతం’ సినిమాల కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జలు కలిసి ‘హను-మాన్’ అనే సినిమా చేస్తున్నారు. తక్కువ బడ్జట్ లో అద్భుతాలు సృష్టించగలనని ఇప్పటికే ప్రూవ్ చేసిన ప్రశాంత్ వర్మ, ఈ సారి ఇండియన్ సూపర్ హీరోని ప్రపంచానికి పరిచయం చేస్తూ ‘హనుమాన్’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. బడ్జట్ కి విజువల్స్ కి సంబంధం లేదు, అంతతక్కువ బడ్జట్ లో ఆ రేంజ్ గ్రాఫిక్స్ వర్క్ ఎలా చేయగలిగారు అంటూ టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ‘హను మాన్’ సమ్మర్ సీజన్ ని టార్గెట్ చేస్తూ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇలాంటి సమయంలో హనుమాన్ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చెయ్యమని సినీ అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. రిక్వెస్ట్ చేస్తే పర్వాలేదు కానీ ఒక సినీ అభిమాని ఏకంగా “ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేస్తారా? లేక నెగటివ్ ట్రెండ్ చెయ్యమంటావా” అంటూ తేజ సజ్జాని ట్యాగ్ చేసి మరీ ట్వీట్ చేశాడు. అతని ఎమోషన్ ని అర్ధం చేసుకున్న యంగ్ హీరో, తల బాదుకుంటూ “అప్డేట్ వస్తుంది వస్తుంది” అంటూ రిప్లై ఇచ్చాడు. ఈ సరదా కాన్వర్జేషణ్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. మొత్తానికి హీరోని భయపెట్టి అప్డేట్ తీసుకున్నావు అంటూ ఒకరు, ఇలా తగులుకున్నారు ఏంట్రా అని ఇంకొకరు? అసలు ఇలా తయారయ్యారు ఏంట్రా? అంటూ మరికొందరు మాట్లాడుకుంటున్నారు. మరి అభిమాని వార్నింగ్ మేరకు హనుమాన్ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.

Show comments