NTV Telugu Site icon

NTR: ధమ్కీ ఈవెంట్ లో ఎన్టీఆర్ కి షాక్ ఇచ్చిన ఫ్యాన్…

Ntr

Ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ కక్యాంపెయిన్ కంప్లీట్ చేసుకోని హైదరాబాద్ తిరిగి వచ్చేసాడు. హైదరాబాద్ తిరిగి వచ్చిన వెంటనే మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన ‘దాస్ కా ధమ్కీ’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి అటెండ్ అయ్యాడు ఎన్టీఆర్. శిల్పకళా వేదికలో జరిగిన ఈ ఈవెంట్ నందమూరి, విశ్వక్ సేన్ మ్యూచువల్ ఫాన్స్ తో నిండిపోయింది. ముఖ్యంగా ఆర్ ఆర్ ఆర్ తర్వాత గ్లోబల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ని చూడడానికి నందమూరి ఫాన్స్ శిల్పకళా వేదికకి వచ్చారు. ఆ ఆడిటోరియం ఇప్పటివరకూ చూడని క్రౌడ్ ని, చెయ్యని సెలబ్రేషన్స్ ని చూపించిన ఎన్టీఆర్ ఫాన్స్, ‘జై ఎన్టీఆర్’ నినాదాలతో శిల్పకళా వేదికని దద్దరిల్లేలా చేశారు. దాస్ కా ధమ్కీ సినిమా హిట్ అవ్వాలి అని చెప్పిన ఎన్టీఆర్, ఇంత అభిమానం చూపిస్తున్న అభిమానులకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా అని చెప్పాడు.

Read Also: Ram Charan: చరణ్ హైదరాబాద్ లో అడుగు పెడితే అర్ధరాత్రి కూడా ర్యాలీ చేశారు

తన స్పీచ్ ముగించుకోని స్టేజ్ దిగుతున్న ఎన్టీఆర్ ని వెనక నుంచి ఒక అభిమాని వచ్చి కింద పడేసినంత పని చేశాడు. ఎన్టీఆర్ ని హగ్ చేసుకోని, ఒక ఫోటో దిగడానికి వచ్చిన అభిమాని వెనక నుంచి వచ్చి ఎన్టీఆర్ ని పట్టుకోవడంతో ఎన్టీఆర్ కిందపడబోయాడు. ఆ షాక్ నుంచి తేరుకున్న ఎన్టీఆర్, తన సెక్యూరిటీని వారించి అభిమానికి సెల్ఫీ ఇచ్చి పంపించాడు. ఎన్టీఆర్ ఫోటో దొరకడంతో ఫ్యాన్ హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటాడు కానీ ఇలాంటి మితిమీరిన అభిమానం ఎప్పటికీ మంచిది కాదు. ఎన్టీఆర్ కి ఏదైనా అయినా, అభిమానికి ఏదైనా అయినా అది అంత మంచి విషయం కాదు. ఈ విషయం అర్ధం చేసుకోని ఏ హీరో అభిమానులు అయినా సరే తమ హీరోలని ఇబ్బంది పెట్టకుండా ఉండే ప్రయత్నం చెయ్యాలి.

Show comments