NTV Telugu Site icon

‘O Saathiya’: అంచనాలు పెంచుతున్న మెలోడీ సాంగ్!

Sadhiya

Sadhiya

ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో ‘ఓ సాథియా’ మూవీ రూపుదిద్దుకుంటోంది. ప్రేమకథలో ఓ డిఫరెంట్ పాయింట్ టచ్ చేస్తూ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు దర్శకురాలు దివ్య భావన. తన్విక జశ్విక క్రియేషన్స్ బ్యానర్ మీద చందన కట్టా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆర్యన్ గౌర, మిస్తీ చక్రవర్తి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలోని మెలోడీ సాంగ్ ను తాజాగా విడుదల చేశారు.

“నేల మీద లేనే ఆ మాట నువ్వు చెప్పగానే…” అంటూ సాగిపోతున్న ఈ మెలోడియస్ సాంగ్ యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా ఉంది. ప్రేయసిపై ప్రేమికుడి గాఢమైన ఫీలింగ్స్ ను ఈ పాటలో గీత రచయిత అనంత శ్రీరామ్ వ్యక్తం చేశారు. దీనికి వినోద్ కుమార్ (విన్ను) స్వరాలు సమకూర్చారు. సాంగ్ టేకింగ్, విజువల్స్ అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి. హీరోహీరోయిన్లపై ఎంతో నాచురల్‌గా చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు ఈ పాట స్థాయిని పెంచాయి. ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌ ప్రేక్షకుల ఆదరణ పొందగా.. ఇప్పుడు విడుదలైన గీతం సినిమాపై అంచనాలను పెంచేలా ఉంది. ఈజే వేణు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అవుతుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో ఉన్న ‘ఓ సాథియా’ అతి త్వరలోనే జనం ముందుకు రానుంది.