నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి దిగ్గజ ఓటిటి సంస్థల నుండి గట్టి పోటీ ఉన్నప్పటికీ తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ‘ఆహా’ నెమ్మదిగా భారీ సంఖ్యలో సబ్‌స్క్రైబర్లను సొంతం చేసుకుంటోంది. వీక్షకుల నుండి అభిప్రాయాన్ని సేకరిస్తూ ‘ఆహా’లో కొన్ని కీలకమైన సాంకేతిక మార్పులు చేశారు నిర్వాహకులు. సబ్‌స్క్రైబర్లు ఇప్పుడు కంటెంట్‌ను 4Kలో చూడవచ్చు. ‘ఆహా 2.0’ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరగగా, ‘ఆహా’ టీమ్‌తో పాటు ఇన్వెస్టర్లు, ప్రమోటర్లు, సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ‘ఆహా 2.0’ రాబోయే రోజుల్లో 8 కొత్త డిజిటల్ ప్రీమియర్‌లతో పాటు తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫారమ్ నిర్మించిన 10 ఒరిజినల్స్ ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
Read Also : పునీత్ రాజ్ కుమార్ పై అవమానకర పోస్ట్… నెటిజన్ అరెస్ట్
ఈ జాబితాలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘లక్ష్య, ‘మంచి రోజులొచ్చాయి’, ‘డీజే టిల్లు’, ‘రొమాంటిక్’, ‘అనుభవించు రాజా’, ‘పుష్పక విమానం’, ‘గని’ లాంటివి మరికొన్ని నెలల్లో ‘ఆహా’లో ప్రీమియర్ షోలు ప్రసారం కానున్నాయి. ఇంకా సేనాపతి, భామా కలాపం, 3 రోజెస్, అన్యాస్ ట్యుటోరియల్, అడల్టింగ్, ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ, సెగు టాకీస్, ఇంటింటి రామాయణం, ఖుబూల్ హై, సర్కార్, అన్‌స్టాపబుల్ వంటి కార్యక్రమాలు కూడా ప్రసారం చేస్తుంది. ‘ఆహా’ సీఈఓ అల్లు అరవింద్ మాట్లాడుతూ గత ఏడాది కాలంలో సబ్‌స్క్రైబర్లు రెండింతలు పెరిగారని, తమకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.