Kaliyuga Ramudu : 40 ఏళ్ళ ‘కలియుగ రాముడు’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actor Nandamuri Taraka Ramarao “Kaliyuga Ramudu” Movie Released 40 Years Ago.
కథలో పట్టు లేకపోతే, ఎంతటి సూపర్ స్టార్ నటించిన చిత్రమైనా ప్రేక్షకాదరణకు నోచుకోదు. మహానటుడు నటరత్న యన్.టి.రామారావు నటించిన చిత్రాలలోనూ అలాంటి సినిమాలు లేకపోలేదు. పైగా ‘రాముడు’ అన్న టైటిల్ తో రూపొందిన చిత్రాలలో యన్టీఆర్ సినిమాలు జనాన్ని నిరాశ పరచిన సందర్భాలు తక్కువే! అలాంటి చిత్రాల కోవకు చెందిన సినిమానే ‘కలియుగ రాముడు’. కె.బాపయ్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1982 మార్చి 13న విడుదలయింది.
Also Read
- Sree Vishnu: అవి చాలా పెద్ద సినిమాలు.. మేము అసలు పోటీనే కాదు.. వెంకీ ఫాన్స్కు పండగే!
- Satvika Veeravalli: 'RC 17' సినిమాకు హీరోయిన్ దొరికేసినట్టేనా..? హీరోయిన్గా తెలుగు అమ్మాయి..
- Tollywood Movies Delayed: స్టార్డమ్ vs కంటెంట్.. వాయిదాల పర్వంలో నలుగుతున్న టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్..!
- Anil Ravipudi: కమర్షియల్ హిట్ కొట్టడం అనిల్ రావిపూడి వల్లే అవుతుందా? మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు?
‘కలియుగ రాముడు’ చిత్ర కథ ఏమిటంటే, రాము ఓ సీబీఐ ఆఫీసర్. అతని చెల్లెలు సావిత్రిని రంజిత్ పెళ్ళి చేసుకుంటాడు. రంజిత్ ఓ నేరస్థుడు. రాముకు సంధ్య అనే అమ్మాయి తారసపడుతుంది. రామును వెంటాడే పనిలో ఆమె ఉంటుంది. ఆమె తండ్రి ఓ సైంటిస్ట్. అతనిని బంధించి, అతను దేశానికి ఉపయోగపడే ఓ ఫార్ములా తయారు చేయగా దానిని సొంతం చేసుకోవాలని రంజిత్ తపన. అలాగే సంధ్యతో రాముపై నిఘా వేయిస్తాడు. ఓ పథకం ప్రకారమే రంజిత్, రాము చెల్లెలిని పెళ్ళాడి ఉంటాడు. చెల్లెలి ముఖం చూసయినా రాము తనను రక్షిస్తాడనే ధీమాతో ఉంటాడు రంజిత్. అయితే రాముకు అన్ని విషయాలు తెలుస్తాయి. అయినా రంజిత్ ను వెంటాడుతాడు. దుర్మార్గుడైన రంజిత్ కారణంగా రాము చెల్లెలు చనిపోతుంది. దాంతో రాము, రంజిత్ ను వదలడు. రామును కాల్చబోయి రంజిత్ ప్రాణాలు కోల్పోతాడు. రాము ఫార్ములాను కాపాడడంతో అతనికి సన్మానం జరుగుతుంది. కథ సుఖాంతమవుతుంది.
తిరుపతి ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ డి.వి.యన్.రాజు సమర్పణలో డి.శ్రీరంగరాజు ‘కలియుగరాముడు’ చిత్రాన్ని నిర్మించారు. అంతకు ముందు ఈ సంస్థాధినేతలు యన్టీఆర్ హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘సింహబలుడు’ చిత్రం నిర్మించారు. ‘కలియుగ రాముడు’ చిత్రానికి చరణ్ దాస్ షోక్ కథ అందించగా, ఆచార్య ఆత్రేయ మాటలు- పాటలు పలికించారు. అప్పలాచార్య హాస్య రచన తోడయింది. కేవీ మహదేవన్ స్వరకల్పన చేశారు. నందమూరి మోహనకృష్ణ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్.
యన్టీఆర్ సరసన రతి అగ్నిహోత్రి నాయికగా నటించిన మూడో చిత్రమిది. అంతకు ముందు ‘ప్రేమసింహాసనం, తిరుగులేని మనిషి’ చిత్రాలలో యన్టీఆర్ తో జోడీ కట్టింది. ఇందులో కవిత, ఎస్.వరలక్ష్మి, జయమాలిని, జయవిజయ, నిర్మలమ్మ, సత్యనారాయణ, జగ్గయ్య, కాంతారావు, ముక్కామల, మిక్కిలినేని, ప్రభాకర్ రెడ్డి, పి.జె.శర్మ, చలపతిరావు, ఆనంద్ మోహన్, భీమరాజు, విజయరంగరాజా నటించారు. ఇందులోని “నదులకు మొగుడు సముద్రమంట…”, “ఆనందో బ్రహ్మ…”, “హల్లా గుల్లా…” వంటి పాటలు అలరించాయి. ‘కలియుగ రాముడు’ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఈ చిత్రం విడుదలైన 16 రోజులకే అంటే 1982 మార్చి 29న యన్టీఆర్ ‘తెలుగుదేశం’ పార్టీని ప్రకటించారు. ఆ తరువాత వరుసగా వచ్చిన ‘జస్టిస్ చౌదరి, బొబ్బిలిపులి’ అనూహ్య విజయాలను సొంతం చేసుకోవడం విశేషం!
తాజావార్తలు
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!
-
Australia Cricket: మరో బాల్ ట్యాంపరింగ్ ప్లాన్?.. వెలుగులోకి సంచలన విషయాలు!
-
Nepal Earthquake: నేపాల్లో భారీ భూకంపం.. సిక్కిం, బెంగాల్లోనూ ప్రకంపనలు..!
-
Sree Vishnu: అవి చాలా పెద్ద సినిమాలు.. మేము అసలు పోటీనే కాదు.. వెంకీ ఫాన్స్కు పండగే!
-
Madurai Section 144: మధురైలో 144 సెక్షన్.. తిరుప్పరంకుండ్రం కొండపైకి భక్తులకు నో ఎంట్రీ!
ట్రెండింగ్
-
8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అమెజాన్లో ప్రత్యక్షమైన iQOO 16..!
-
Karthika Pournami: ఆడంబరం కాదు.. భక్తే ప్రధానం..! కార్తీక పౌర్ణమి అసలు కథ ఇదే..
-
Ishan Kishan Emotional: దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివి.. ధోనీ రిటైర్మెంట్పై ఇషాన్ కిషన్ ఎమోషనల్..!
-
PUBG MOBILE గ్లోబల్ ఛాంపియన్షిప్కు స్పాన్సర్ గా REDMAGIC.. 11S Pro స్మార్ట్ఫోన్తో గేమింగ్ సందడి..!
-
రూ.399కే అన్లిమిటెడ్ డేటా, OTT బెనిఫిట్స్..! Jio Happy New Year 2027 ఆఫర్ లాంచ్..