Prabhas Eeshwar: ఇరవై ఏళ్ళ ‘ఈశ్వర్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas Eeshwar: అప్పటికే తెలుగు చిత్రసీమలో వారసుల హవా విశేషంగా వీస్తోంది. టాప్ ఫోర్‌లో ముగ్గురు సినిమా రంగానికి చెందిన వారసులే. తరువాతి తరం టాప్ స్టార్స్ లోనూ మహేష్, జూనియర్ ఎన్టీఆర్ వంటివారు అలరిస్తున్న సమయమది. తమ అభిమాన హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు నటవారసునిగా ఆయన తమ్ముని తనయుడు ప్రభాస్ అరంగేట్రం చేస్తున్నారని తెలియగానే ఫ్యాన్స్ ఆనందంతో చిందులు వేశారు. ప్రభాస్ కు ‘యంగ్ రెబల్ స్టార్’ అంటూ టైటిల్ ఇచ్చేసి ఆయన మొదటి సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూడసాగారు. వారిని మురిపించడానికి ప్రభాస్ ‘ఈశ్వర్’గా జనం ముందు నిలిచారు. జయంత్ సి.ఫరాన్జీ దర్శకత్వంలో నటనిర్మాత అశోక్ కుమార్ తమ శ్రీలక్ష్మీ వేంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ‘ఈశ్వర్’ 2002 నవంబర్ 11న విడుదలైంది.
కథ విషయానికి వస్తే.. తల్లి లేని ఈశ్వర్ అల్లరి చిల్లరగా ధూల్ పేటలో తిరుగుతూ ఉంటాడు. అతని తండ్రి గుడుంబా కాస్తూ ఉంటాడు. ఈశ్వర్ తండ్రి సుజాత అనే ఆమెను పెళ్ళాడతాడు. ఆమెకు ఇరవై ఏళ్ళ నుంచీ ఈశ్వర్ తెలుసు. అందువల్ల ఈశ్వర్ అంటే అభిమానం చూపిస్తుంది. కానీ సవతి తల్లిని ఈశ్వర్ ఎప్పుడూ ఏవగించుకుంటూ ఉంటాడు. ఈశ్వర్ ఓ సారి రోడ్ లో ఇందు అనే అమ్మాయిని చూసీ చూడగానే ప్రేమలో పడతాడు. ఆమె కూడా ఈశ్వర్ ను ప్రేమిస్తుంది. అయితే ఇందు తండ్రి దుర్గా ప్రసాద్ కు ధనగర్వం ఉంటుంది. పేదలంటే అసహ్యించుకుంటూ ఉంటాడు. అతను ఆ ఏరియాకు ఎమ్మెల్యే. దాంతో మరింత రెచ్చిపోతూ ఉంటాడు. ఈశ్వర్, ఇందు ప్రేమ తెలిసి, ఈశ్వర్ ను అంతం చేయాలని చూస్తాడు. తండ్రి ఊళ్ళో లేని సమయంలో ఈశ్వర్‌తో ఇందు చెట్టాపట్టాలేసుకు తిరుగుతుంది. అతను రాగానే ఈశ్వర్ ను పోలీసులతో కుల్లబొడిపిస్తాడు. ఇందు కనిపించదు. దాంతో ఆమెను ఏంచేశారోనని దుర్గాప్రసాద్ ఈశ్వర్ తండ్రి, సవతితల్లిని కూడా హెచ్చరిస్తాడు. చివరకు ఇందు, ఈశ్వర్ నే కోరుకుంటూ ధూల్ పేట వస్తుంది. అది తెలిసిన తండ్రి ఈశ్వర్ సవతి తల్లిని చిత్రహింసలకు గురి చేస్తాడు. ఆ దాడిలో ఆమె చనిపోతుంది. ఆమెను చూడటానికి పోలీసులు ఈశ్వర్ ను తీసుకు వస్తారు. దహనసంస్కారాలు కాగానే, ఈశ్వర్ దుర్గాప్రసాద్ మనుషులను చితగ్గొడతాడు. ఇందును పెళ్ళాడి తల్లి ఆత్మకు శాంతి చేకూర్చాలని చూస్తాడు. పెళ్ళి జరుగుతూ ఉండగా, దుర్గాప్రసాద్ పోలీసులను వేసుకొని వస్తాడు. ధూల్ పేట జనం తిరగబడతారు. తండ్రిని కాలుతో తన్నిన దుర్గా ప్రసాద్‌ను ఈశ్వర్ బాదేస్తాడు. అందరూ అతడిని చంపబోతారు. ఈశ్వర్ వదిలేయమని చెబుతాడు. అదే సమయంలో దుర్గాప్రసాద్ సొంత కొడుకు కూడా వచ్చి, చెల్లెలి పెళ్ళిని బలపరుస్తాడు. దుర్గాప్రసాద్ లోనూ మార్పు వస్తుంది. చివరకు ఈశ్వర్ తో కూతురు పెళ్ళి జరిపిస్తాడు దుర్గాప్రసాద్.
Also Read
ఇందులో ఈశ్వర్‌గా ప్రభాస్, ఇందుగా శ్రీదేవి (ఓనాటి అందాలతార మంజుల కూతురు) నటించగా, మిగిలిన పాత్రల్లో శివకృష్ణ, రేవతి, అశోక్ కుమార్, ధీరజ్ కృష్ణ, రవికాంత్, హనుమంతు, అశోక్ కుమార్, అభినయ కృష్ణ, అల్లరి సుభాషిణి, పావలా శ్యామల ఇతర పాత్రధారులు. ఈ చిత్ర నిర్మాత అశోక్ కుమార్ హీరోయిన్ తండ్రిగా నటించారు. ఈ నాటి ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఇందులో పోలీస్ ఇన్ స్పెక్టర్ గా కనిపించడం విశేషం. ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ రచన ఎస్సెట్. కృష్ణంరాజు పాత చిత్రాలలో పోలిన సంభాషణలు కొన్ని ఇందులో వినిపిస్తాయి. “రెండువందల పదకొండు… అది మా ఇంటి నంబర్ కాదు.. నా వంటిపై పడ్డ దెబ్బలు… దెబ్బకు దెబ్బ తీయకపోతే… నా అబ్బకు పుట్టినవాణ్ణి కాను…” అంటూ ప్రభాస్ చెప్పిన వైనం అభిమానులను కిర్రెక్కించింది.
ఈ సినిమాకు ఆర్.పి.పట్నాయక్ బాణీలు కట్టగా, సీతారామశాస్త్రి పాటలు పలికించారు. ‘అమీర్ పేటకు ధూల్ పేటకు షెహరొకటేరా…’,‘గుండెలో వాలవా.. చెలి చిలకా..’, ‘ఓలమ్మో ఓలమ్మో..’, ‘ధిందిరనా ధిందరనా..’, ‘ఇన్నాళ్ళూ చూడకున్నా..’, ‘కోటలోని రాణి..’ అంటూ సాగే పాటలు అలరించాయి. సినిమాలో ఏ మాత్రం కొత్తదనం లేకపోవడం, సన్నివేశాలు కూడా పాతగా కనిపించడంతో పెద్దగా అలరించలేకపోయింది. అయితే నటునిగా ప్రభాస్ కు మంచి మార్కులే సంపాదించి పెట్టింది.
(నవంబర్ 11న ‘ఈశ్వర్’కు 20 ఏళ్ళు)
తాజావార్తలు
-
Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Simple Wave Electric Scooter: సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫుల్ ఛార్జ్‌తో 243KM రేంజ్.. ధర ఎంతంటే?
-
Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్‌లైన్ మిస్సైతే..!
-
KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!