రాబరీ థ్రిల్లర్‌గా మునుపెన్నడూ చూడని వైవిద్యభరితమైన కథాంశంతో తెరకెక్కుతోంది ‘1134’ మూవీ. శరత్ చంద్ర తడిమేటి, తనే కథ రాసుకొని హై టెక్నికల్ వాల్యూస్‌తో అన్ని వర్గాల ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
Read Also : Rashmika: నా భర్త అతడే.. లవ్ మ్యారేజ్ కన్ఫర్మ్ చేసిన రష్మిక
రాంధుని క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీ గురించి శరత్ మాట్లాడుతూ, ”ఇందులోని ఈ ప్రతి సన్నివేశం థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. మరికొద్ది రోజుల్లో మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బాగా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశాం. ‘1134’ అనే డిఫరెంట్ టైటిల్‌కి తగ్గట్టుగా డిజైన్ చేసిన ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. నడిరోడ్డుపై డబ్బుల బ్యాగ్, ఆ వెనుక ముగ్గురు వ్యక్తుల షాడోతో కూడిన ఈ పోస్టర్ చూస్తుంటే ఇది సమ్ థింగ్ స్పెషల్ మూవీ అనే భావన ప్రతి ప్రేక్షకుడిలో కలగడం ఖాయం. మేం ఏ ఆలోచనతో అయితే ఈ పోస్టర్ ను డిజైన్ చేశామో అది నెరవేరుతోంది. గంగాధర్ రెడ్డి, ఫణి శర్మ, మదుపు ఫణి భార్గవ్, కృష్ణ మదుపు ఇందులో కీలక పాత్రలు పోషించారు. శివతేజ్ బైపల్లి, శరత్ కూతాడి సంగీతం అందిస్తున్నారు. నజీబ్ షేక్, జితేందర్ తలకంటి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. మొత్తంగా తెలుగు ప్రేక్షకులకు మా సినిమా ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుందని చెప్పగలను” అని అన్నారు.