‘టెన్త్ క్లాస్ డైరీస్’కోసం ఐటమ్ సాంగ్ పాడిన ఇండియన్ ఐడిల్ రేవంత్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ‘గరుడవేగ’ అంజి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇందులో శ్రీనివాసరెడ్డి, ‘వెన్నెల’ రామారావు, అర్చన, హిమజ, శివబాలాజీ, మధుమిత, ‘సత్యం’ రాజేష్, భానుశ్రీ, నాజర్, శివాజీ రాజా, సంజయ్ స్వరూప్, దీపా సాయిరామ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ ‘సిలకా… సిలకా… రామా సిలకా’ విశేషాలు తెలిపారు దర్శక నిర్మాతలు. ఈ సందర్భంగా నిర్మాతలలో ఒకరైన అచ్యుత రామారావు మాట్లాడుతూ “ఇంతకు ముందు ‘రోజ్ విల్లా’, ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాలు ప్రొడ్యూస్ చేశాను. రెండూ హ్యాపీ ప్రాజెక్ట్స్. అమెజాన్‌లో వాటికి టాప్ వ్యూస్ ఉన్నాయి. కమర్షియల్ హంగులతో ‘టెన్త్ క్లాస్ డైరీస్’ తీర్చిదిద్దాం. సరికొత్త కాన్సెప్ట్ తో తీసిన సినిమా ఇది. టెన్త్ క్లాస్ చదివిన ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన చిత్రమిది. అందరూ కనెక్ట్ అయ్యే సినిమా. మనం డిగ్రీలు, పీజీలు, పీహెచ్‌డీలు చేసినా… టెన్త్ క్లాస్ అనేది మెమరీ మైల్ స్టోన్ లాంటిది. ఆ మెమరీస్ మిగతా జీవితం మీద డైరెక్ట్‌గా, ఇన్ డైరెక్ట్‌గా ప్రభావం చూపిస్తాయి. ఒక రకంగా లైఫ్ పార్ట్నర్ లాంటిది. ఆ నేపథ్యంలో చాలా ఆసక్తికరంగా, లైవ్లీగా సినిమాలో సన్నివేశాలు ఉంటాయి. ఇదొక మంచి కామెడీ ఎంటర్టైనర్” అని అన్నారు.
‘గరుడవేగ’ అంజి మాట్లాడుతూ ” సిలకా… సిలకా… రామా సిలకా… ఏదో ఉందే మెలికా… అంటూ ఇండియన్ ఐడల్ రేవంత్ పాడిన ఈ పాటను కాసర్ల శ్యామ్ రాశారు. సురేష్ బొబ్బిలి మంచి ట్యూన్ ఇచ్చారు. టాప్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వం వహించారు. ఇది మంచి ఐటమ్ సాంగ్. ప్రధాన తారాగణంతో పాటు 150 మంది జూనియర్ ఆర్టిస్టులు, 30 మంది డాన్సర్లపై ఈ పాటను తెరకెక్కించాం. ఇద్దరు ముంబై డాన్సర్లు ఈ పాటలో స్పెషల్ అట్రాక్షన్ అవుతారు. సినిమా చిత్రీకరణ అంతా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రిపబ్లిక్ డే రోజు (జనవరి 26)న టీజర్ విడుదల చేస్తాం. ఛాయాగ్రాహకుడిగా నా 50వ చిత్రమిది” అన్నారు.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు