ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎఫైర్ అనే మాటను వింటున్నాం.. ఆడ లేదా మగ ఎవరొకరు ఇలా ఎవరొకరు తమ పార్ట్నర్ తో పొందలేని ఆనందాన్ని వేరొకరితో పొందుతారు.. ఆ బందాన్ని సీక్రెట్ గా ఉంచుతారు. ఎప్పుడొకసారి ఆ విషయం బయటపడక తప్పదు.. ఆ తర్వాత జరిగే పరిణామాలు అస్సలు ఊహించలేము.. అయితే అలాంటి వాటి నుంచి బయటపడాలంటే ముందుగా కొన్ని విషయాలను తెలుసుకొని జాగ్రత్త పడటం మంచిది.. అవేంటో ఒకసారి చూసేద్దాం..
వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకున్నప్పుడు రిలేషన్‌పై ఇంట్రెస్ట్ లేకపోవడం. మన పార్టనర్‌ని ముందుగా చూసినట్లుగా చూసుకోలేరు. వారు ఎంత బాగా ఉన్నా ఏ విషయంలో కూడా పట్టించుకోకపోవడం చేస్తారు.. మనమంటేనే అస్సలు ఇష్టం లేనట్లు, ఇంకా చెప్పాలంటే తెలియని వ్యక్తితో ఉన్నట్లు ఉంటారు..
అంతేకాదు ఫోన్ పైనే ఫోకస్ పెడతారు.. ఎక్కువ సేపు ఫోన్లో గడుపుతారు.. సోషల్ మీడియాలో చాట్ చేస్తూ బిజీగా ఉంటారు.. పక్కన మనుషులు ఎవరున్నా కూడా మునిగిపోతారు.. మొబైల్ లాక్ చేస్తారు. కాల్, బ్రౌజింగ్ హిస్టరీని డెలీట్ చేస్తారు..ఎప్పుడు ఒంటరిగా ఫోన్‌తో అలానే ఉండిపోతారు. ముక్కుసూటిగా ఏ విషయాన్ని చెప్పరు. అబద్ధాలు చెప్పడం కూడా చేస్తారు. హడావిడిగా ఉంటారు. అప్పటికప్పుడు రెడీ అయి వెళ్ళిపోవడం, ఆలస్యంగా ఇంటికి రావడం, వీకెండ్ పార్టీలని వెళ్ళిపోతారు.. ఇలాంటివి చేస్తే వాళ్లు వేరొకరితో రిలేషన్ లో ఉన్నారని అర్థం..