Tips For Work Stress: చుట్టూ ఉన్న పరిస్థితుల కారణంగానో, మనుషుల వల్లనో చోటు చేసుకునే సంఘటనలు.. వ్యక్తుల మీద భౌతిక, మానసిక, ఉద్వేగపరమైన మార్పు కలగజేసినప్పుడు దానికి శరీరం స్పందించే తీరు ‘ఒత్తిడి’గా బయటపడుతుంది. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో ‘ఒత్తిడి’ ఒక భాగమైపోయింది. చాలా మంది పని వల్ల నిత్యం ఒత్తిడికి లోనవుతుంటారు. ఎక్కువ మంది ఒత్తిడికి దూరంగా ఉండలేకపోతున్నారు. అయితే ఒత్తిడిని పూర్తిగా దూరం చేయలేకున్నా.. కంట్రోల్ మాత్రం చేయొచ్చు. మీరు పని ఒత్తిడిని తగ్గించుకోవాలంటే చాలా టిప్స్ ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం.
మీ కోసం కొన్ని నిమిషాలు:
బిజీ లైఫ్‌లో మీ కోసం రోజులో కొన్ని నిమిషాలు వెచ్చించండి. దీని కోసం తోటి సహుద్యోగులతో మీటింగ్ లేదా పని మధ్యలో పాటలు వినండి. అప్పుడప్పుడు ఫన్నీ వీడియోలను చూడండి. ఇలా చేయడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.సెలవులో ఉన్నప్పుడు మీ ఫోన్ మరియు ల్యాప్‌టాప్‌కు దూరం ఉంచడం చాలా మంచిది.
కంటినిండా నిద్ర:
కంటినిండా నిద్రపోవడం వల్ల శరీరంతో పాటు మనసూ రిలాక్సవుతాయి. అప్పుడు ఏకాగ్రత పెరుగుతుంది.
యోగా:
యోగా చేయడం వల్ల మీ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడమే కాకుండా ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. రోజువారీ ఉదయపు దినచర్యలో యోగాను చేర్చుకోండి. ఇలా చేయడం ద్వారా మీరు ఆఫీసు ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. రోగాల బారిన పడకుండా ఉండొచ్చు. అందుకే యోగాను జీవితంలో భాగం చేసుకోండి.
టూర్ ప్లాన్:
కొన్నిసార్లు ఒత్తిడికి గురికావడం ఉండేందుకు టూర్ ప్లాన్ చేసుకోవడం మంచి పద్దతి. కుదిరితే వారం రోజులు ప్లాన్ చేసుకోండి. స్నేహితులతో సరదాగా ఎంజాయ్ చేయండి. తద్వారా అతిగా ఆలోచించడం ఉండదు. అప్పుడు మెదడుపై పెద్దగా పనిభారం ఉండదు.
కాఫీ, టీలు పూర్తిగా మానేయాలి:
కెఫీన్ ఆందోళనను పెరిగేలా చేస్తుంది. కాబట్టి కాఫీ, టీలు మానేయాలి.
బలమైన నెట్‌వర్క్:
ఒత్తిడిని తగ్గించుకోవడానికి మంచి వ్యక్తులతో స్నేహం చేయండి. మీ చుట్టుపక్కల సహాయం చేయండి. ఇలా చేయడం ద్వారా మీరు రిలాక్స్‌గా ఉంటారు. మీరు ఒత్తిడిని వదిలించుకోవాలనుకుంటే.. స్నేహితులతో ఏడు గంటలు గడపండి. ఇలా చేయడం వల్ల మీరు మంచి అనుభూతి చెందుతారు.
Also Read: Kidney Problem In Women: మహిళల్లో కిడ్నీ సమస్యలకు ప్రధాన కారణాలు ఇవే.. జాగ్రత్త సుమీ!