ఈరోజుల్లో మనుషుల ఆహారపు అలవాట్లు, జీవన శైలి లో మార్పులు రావడం వల్ల మనుషులు అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.. అంతేకాదు చాలా మంది అమ్మాయిలు పీసీఓడీ, పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్నారు. ఇది మూడ్ స్వింగ్స్, చిరాకు కలిగిస్తుంది..ఆ సమయంలో వచ్చే నొప్పుల నుంచి బయట పడాలంటే మంచి ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.. ఇక పీరియడ్స్ సమయంలో అస్సలు తీసుకోకూడని ఆహార పదార్థాలను ఇప్పుడు తెలుసుకుందాం…
*. బహిష్టు సమయంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ కు గురవుతారు. ఇది తలనొప్పి, ఉబ్బరం, విరేచనాలు, వికారం వంటి జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి మీరు మీ పీరియడ్స్ సమయంలో మధ్యానికి వీలైనంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు అంటున్నారు..
*. ఫ్రిజ్‌లోని చల్లటి నీరు తాగకూడదు. మీకు కడుపులో లేదా దాని చుట్టుపక్కల ప్రాంతంలో నొప్పి ఉన్నప్పుడు గోరువెచ్చని నీటిని తాగడం మానుకోండి. ఇది నొప్పి నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. టీ-కాఫీ మానుకోండి. టీ, కాఫీ తాగడం వల్ల నొప్పి నుండి కొంత ఉపశమనం లభిస్తుందని మీరు అనుకుంటే పొరపాటే.. ఎక్కువగా నీరు తాగడం మేలు..
*.పీరియడ్స్ సమయంలో పండ్లు తినాలనుకుంటే మామిడి, దానిమ్మ, అరటి, ఆపిల్ తినవచ్చు. అయితే ఖాళీ కడుపుతో పండ్లు తినకూడదు. ఇది మీ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది.. ఇక డార్క్ చాక్లేట్స్ ను తీసుకోవడం కూడా మంచిదే..
*.రెడ్ మీట్ అస్సలు తీసుకోవడం మంచిది కాదు..
*.టైంకు తినడం చాలా మంచిది.. ఐరన్ ఉన్న పండ్లను ఎక్కువగా తీసుకోవడం మంచిది..
*. ఖాళీ కడుపున ఖార్జురాలు, గ్రీన్ టీ తీసుకోవడం మంచిది..*. మీరు ఋతుస్రావం మొదటి రోజున కోరికలు ఉంటే మీరు అల్పాహారం కోసం వెన్న, తేనెతో పాన్కేక్లను తినాలి..
*.భోజనం సమయంలో, మీరు అన్నం, రోటీ లేదా సలాడ్ మిశ్రమ కూరగాయలతో తీసుకోవచ్చు..
*.సాయంత్రం పూట ఒక గ్లాసు నిమ్మరసం తాగండి..
*. ప్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం మంచిది..