Why Humans Cry: ఏడిస్తే కన్నీళ్లు పెట్టుకునే ఏకైక జీవులు ఏంటో తెలుసా.. మనుషులు. కన్నీళ్లు అనేటివి కేవలం మనుషులకు మాత్రమే వస్తాయి. ఇక్కడ విశేషం ఏమిటంటే ఏదో ఒక సందర్భంలో రాజు నుంచి పేదవాడు వరకు ఈ భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ ఏడుస్తారు. ఈ ఏడుపు అనేది భూమిపై జీవించే మరే ఇతర జీవిలో రాదని చెబుతున్నారు. ఇంతకీ అసలు ఏడుపు అనేది ఎందుకు వస్తుందో తెలుసా?..
READ ALSO: Mouli : నువ్ కేక బాసూ.. రెండో సినిమాకే కోటి రెమ్యునరేషన్
ఏదో ఒక మానసిక స్థితిలో కన్నీళ్లు పెట్టుకుంటారు..
కొన్నిసార్లు ఆనందంలో, మరికొన్ని సార్లు బాధలో, ఇంకొన్ని సార్లు షాక్‌తో కన్నీళ్లు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే కొన్ని కొన్ని సార్లు మరికొన్ని జీవుల కళ్ల నుంచి కూడా కన్నీళ్లు వస్తుంటాయి. అయితే అవి కళ్లను రక్షించేవని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఏదో ఒక మానసిక స్థితిలో మనుషులు ఏడుస్తారని నిపుణులు చెబుతున్నారు.
న్యూయార్క్ టైమ్స్‌లోని నిర్వహించిన పలు పరిశోధనలలో కన్నీళ్ల గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించారు. న్యూరో సైంటిస్టులు అనుకున్నదానికంటే.. భావోద్వేగాల నుంచి వచ్చే కన్నీళ్లు చాలా క్లిష్టంగా ఉన్నాయంటున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే మానవ మెదడులో విచారం, కోపం వంటి భావోద్వేగాలకు కారణమయ్యే ఏ ఒక్క ప్రాంతం కూడా లేదని చెబుతున్నారు. ఈ కన్నీళ్లను అర్థం చేసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నా.. మనుషుల్లో ఎందుకు కన్నీరు వస్తుందో ఇప్పటి వరకు అర్థం చేసుకోలేకపోయారు.
చాలా జంతువులు ఆపద సమయంలో అరుస్తుంటాయి. వాస్తవానికి, బాల్యంలో క్షీరదాలు, పక్షులు వారి తల్లిదండ్రులపై మాత్రమే ఆధారపడతాయి. సంక్షోభ సమయంలో అవి తమ ఆపదల గురించి పెద్దలకు తెలియజేడానికి అరుపుల ద్వారా శబ్దాలు చేస్తాయని చెబుతున్నారు. ఉదాహరణకు కోడిపిల్లలు లేదా మేకలు ఆకలిగా అనిపించినప్పుడు, ఇతర జీవాలను చూసి భయపడినప్పుడు కొన్ని రకాల ధ్వనులను చేస్తాయి. ఈ ధ్వనులను విన్నవెంటనే వాటి తల్లిదండ్రులు వాటిని వెతుక్కుంటూ అవి ఎక్కడ ఉన్నాయో అక్కడికి పరుగుపరుగున వస్తుంటాయి. అంతే కానీ ఇవి కన్నీళ్లు పెట్టుకోవడం లాంటివి చేయవు.
పురుషలతో పోల్చితే మహిళలు ఎక్కువగా ఏడుస్తారు..
ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పరిశోధనల్లో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. పురుషుల కంటే మహిళలు నిరంతరం ఏడుస్తారని ఈ పరిశోధనల ఫలితాలు వెల్లడించాయి. ఏడుపు అనేది ప్రధానంగా లింగ విశ్వాసాలకు, సామాజిక ఒత్తిడికి సంబంధించినదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కార్నెల్ యూనివర్శిటీకి చెందిన సైకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ జోనాథన్ రోటెన్‌బర్గ్ మాట్లాడుతూ..
పిల్లలు పుట్టినప్పుడు అబ్బాయి అయినా, ఆడపిల్ల అయినా మొదట్లో ఇలాగే ఏడుస్తారని అయితే అమ్మాయిలు పెద్దయ్యాక వెంటనే కన్నీళ్లు వస్తాయని చెప్పారు. సామాజిక ఒత్తిడి కారణంగా అబ్బాయిలు తమ కన్నీళ్లను అణచివేయడం నేర్చుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే అబ్బాయిలు కౌమారదశలో ప్రవేశించినప్పుడు, వారి శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయి పెరుగుతుందని, ఇది కన్నీళ్లను అణిచివేస్తుందని చెప్పారు. బాలికలలో ఈస్ట్రోజెన్ హార్మోన్ కన్నీళ్లను పెంచుతుందని వెల్లడించారు.
నెదర్లాండ్స్‌లోని టిల్బర్గ్ యూనివర్శిటీలో క్లినికల్ సైకాలజీ ఎమెరిటస్ ప్రొఫెసర్, మనుషులలో ఏడుపుపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్త ఎడ్ వింగర్హౌట్స్ దు:ఖంపై సంచలన విషయాలు చెప్పారు. ఏడ్చినప్పుడు కళ్లపై అదనపు ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉందని, దీని కారణంగా కన్నీటి గ్రంధి చురుకుగా మారుతుందని చెప్పారు. మనం బిగ్గరగా నవ్వినప్పుడు, ఎక్కిళ్ళు వచ్చినప్పుడు, వాంతి చేసుకున్నప్పుడు, కళ్లలో నుంచి కన్నీళ్లు వస్తాయని అన్నారు. కొన్నిసార్లు ఏడుపు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన చెప్పారు. ఒక్కసారి కొన్నివేల మందిని చివరిసారిగా ఏడ్చారు. ఆ తర్వాత వాళ్లను ఏం ఫీలయ్యారని అడిగితే సగం మంది ఏడ్చిన తర్వాత బాగుందని చెప్పారని ఆయన వెల్లడించారు..
READ ALSO: Why Can’t I Sleep: మీకు నిద్రపట్టకపోడానికి కారణాలు తెలుసా?