ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు అనేక రకాల తీవ్రమైన కడుపు సంబంధిత సమస్యలకు గురవుతున్నారు. హెర్నియా కూడా ఆ సమస్యలలో ఒకటి. దీని ప్రమాదం కూడా క్రమక్రమేణా పెరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఇంగువినల్ హెర్నియా అనేది ఒక రకమైన హెర్నియా. దీనివల్ల దిగువ ఉదర కండరాలలో బలహీనత సమస్య ఏర్పడుతుంది. దీనికి శస్త్రచికిత్స అవసరం. అయితే.. హెర్నియా సమస్య ఎవరికైనా వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా వృద్ధులకు వస్తుంది.. యువకులు కూడా ఈ సమస్యను ఎదుర్కుంటున్నారు. అసలు.. హెర్నియా అంటే ఏమిటి. దీని వల్ల వచ్చే సమస్య గురించి వివరంగా తెలుసుకుందాం.
Heavy rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. రెడ్ అలర్ట్ జారీ
హెర్నియా సమస్య ఏమిటి?
మీ ఉదర కుహరంలోని కొంత భాగం రంధ్రం ద్వారా పొడుచుకు వచ్చినప్పుడు లేదా కణజాలంలో బలహీనత ఏర్పడినప్పుడు హెర్నియా సంభవిస్తుంది. అది.. నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది. ఇంగువినల్ హెర్నియా కూడా అలాంటి సమస్యే. హెర్నియా సమస్య పొట్టలో ఉబ్బెత్తునకు కారణం కావచ్చు. దాని వల్ల దగ్గు, తుమ్ము, బరువైన వస్తువులను ఎత్తినపుడు దాని వల్ల నొప్పి వస్తుంది. దాని పరిస్థితి కొన్నిసార్లు తీవ్రంగా ఉంటుందని వైద్య నివేదికలు చెబుతున్నాయి.
ఈ సమస్య ఎందుకు వస్తుంది?
చాలా సందర్భాలలో హెర్నియా రావడానికి స్పష్టమైన కారణం ఉండదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వయస్సు పెరిగే కొద్ది హెర్నియా సమస్య పెరుగుతుంది. ఇది.. మహిళల కంటే పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది. హెర్నియా పుట్టుకతో కూడా వస్తుంది. అనేక రోజువారీ కార్యకలాపాలు, వైద్యపరమైన సమస్యలు ఉదర గోడపై ఒత్తిడిని పెంచుతాయి. ఇది హెర్నియాకు దారి తీస్తుంది. దీర్ఘకాలిక మలబద్ధకం, నిరంతర దగ్గు, సిస్టిక్ ఫైబ్రోసిస్, ప్రోస్టేట్ సమస్య, అధిక బరువు లేదా ఊబకాయం కారణంగా హెర్నియా సమస్య వస్తుంది.
దాని లక్షణాలు ఏమిటి?
హెర్నియా లక్షణాలు అందరిలోనూ కనిపించవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సాధారణంగా.. కొన్ని శారీరక శ్రమల సమయంలో కడుపులో ఒక ముద్ద లేదా ఉబ్బడం స్పష్టంగా కనిపిస్తుంది. హెర్నియా కారణంగా.. కడుపులో నొప్పి లేదా ముడతలు పడుతాయి. దీంతో.. నొప్పి సమస్యలు ఎక్కువగా వస్తాయి.
హెర్నియా చికిత్స మరియు నివారణ పద్ధతులు
చాలా సందర్భాలలో హెర్నియాకు శస్త్రచికిత్స అవసరమవుతుంది. దీనిలో హెర్నియేటెడ్ కణజాలం దాని స్థానంలో తిరిగి అమర్చబడుతుంది. ఇది శస్త్రచికిత్సా మెష్తో ముడిపడి ఉంటుంది. పుట్టుకతో వచ్చే లోపాలను అరికట్టలేమని వైద్యులు చెబుతున్నారు. అయినప్పటికీ.. ఉదర కండరాలు, కణజాలాలపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించడానికి కొన్ని చర్యలు ఉన్నాయి. అధికంగా బరువు పెరగకుండ ఉండటం.. అధిక ఫైబర్ ఉండే ఆహారాలు తినకపోవడం వల్ల ఈ సమస్య రాదు.
