Site icon NTV Telugu

Cancer Research: సిగరెట్స్, మందు తాగకపోయినా క్యాన్సర్.. వీళ్లకు కచ్చితంగా రావొచ్చు..!

Cancer Medicine

Cancer Medicine

క్యాన్సర్ అంటే ఏమిటి? సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో జరుగుతాయి. అయితే, కొన్ని కారణాల వల్ల, ఆ కణాలు నియంత్రణ కోల్పోయి, చాలా వేగంగా, అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి. ఆ స్థితిని క్యాన్సర్ అంటారు. ఈ కణ సమూహాలను ‘కణితి'( ట్యూమర్) అని పిలుస్తారు. దేశంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో మొదటి స్థానం గుండె జబ్బులది కాగా, ఆ తరవాత స్థానం క్యాన్సర్‌దే. ప్రపంచ వ్యాప్తంగా, ఏటా కోటి మంది క్యాన్సర్‌తో మరణిస్తున్నారు. మన దేశంలో, ప్రతి సంవత్సరం సుమారు పదకొండు లక్షల మందికి క్యాన్సర్ సోకినట్లుగా నిర్ధారణ అవుతోంది. నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, ఊపిరి తిత్తుల క్యాన్సర్, కడుపు క్యాన్సర్ వీటిలో మొదటి వరుసలో ఉంటున్నాయి.

READ MORE: Kethireddy Venkatarami Reddy: చంద్రబాబు ఉన్నప్పుడు పంట పెడితే నాశనమే..! కేతిరెడ్డి హాట్‌ కామెంట్స్

కేవలం సిగరెట్, మందు తాగడం వల్ల మాత్రమే క్యాన్సర్స్ వస్తాయని అనుకుంటారు. వాస్తవానికి.. కుటుంబాల్లో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే ఆ ప్రభావం కూడా పిల్లలపై ఉండే అవకాశం ఉంది. ఓ వ్యక్తిలో వయస్సు, అధికబరువు, హార్మోన్లు, వర్కౌట్ చేయడం వల్ల క్యాన్సర్స్ వస్తాయి. వీటిని జెనెటిక్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎప్పటికప్పుడు పరీక్ష చేయించుకోవడం ద్వారా ఈ క్యాన్సర్స్ గురించి ముందుగానే తెలుసుకుని జాగ్రత్త పడొచ్చొని నిపుణులు చెబుతున్నారు. ఆహారపు అలవాట్లు, జీవనశైలి సరిగ్గా లేకపోవడం, ధూమపానం, మద్యపానం, అంటువ్యాధుల కారణంగా కొందరికి క్యాన్సర్స్ వస్తాయి. కొందరికి ఎలాంటి కారణాలు, కుటుంబంలో లేకపోయినా క్యాన్సర్‌ రావొచ్చు. దీన్ని స్పోరాడిక్ క్యాన్సర్ అంటారు. జన్యు ఉత్పరివర్తనాల వల్ల ఈ సమస్య రావొచ్చు. లైఫ్‌స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల క్యాన్సర్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

READ MORE: Mohammed Siraj: డిఎస్పి మ‌హ్మ‌ద్ సిరాజ్‌కు ఐసీసీ షాక్.. భారీ జ‌రిమానా.. అంతేకాదండోయ్..!

Exit mobile version