Tea History: ఉదయాన్నే లేవగానే చాలా మందికి టీ తాగడం అలవాటు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా టీ ప్రియులు ఉన్నారు. ప్రపంచంలో టీ తాగే ప్రేమికులకు కొదవ లేదు. పేదల నుంచి ధనికుల వరకు టీ ప్రియులే! ఆశామోహాలను దరి రానీయకుండా, అన్యులకోసమే జీవితాన్ని త్యాగం చేసే తపోధనులూ ఉష్ణోదక ఆరాధకులే! ముఖ్యంగా బౌద్ధ సన్యాసులు తరతరాలుగా ఏకాక్షరీని ఆచరిస్తున్నారు. బౌద్ధ సన్యాసులు తత్వశాస్త్రం, సత్యం కోసం అన్వేషణలో టీని ముఖ్యమైనదిగా భావిస్తారు. ధ్యానంపై మనసు కేంద్రీకరించేందుకు అడపాదడపా టీ తాగడం అలవాటు! ఆ అలవాటు తెలిగలదని అనుకుంటే అది మన తప్పు! బుద్ధుని అనుగ్రహం వల్లే టీ పుట్టిందని నమ్మేవారూ ఉన్నారు. దీనికి బలం చేకూర్చేలా చైనా, టిబెట్‌లోని బౌద్ధ విహారాల్లో ఓ కథనం విస్తృతంగా ప్రచారంలో ఉంది.
జ్ఞానోదయం కోసం తపస్సు చేస్తున్న గౌతముడు తరచుగా నిద్రపోతాడు! ఇది ధ్యానాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఈ నిద్ర కారణంగా బుద్ధుడు తన మనస్సును లగ్నం చేయలేక పోతున్నాని అసహనానికి గురయ్యాడు. నిద్రపోకుండా ఉండటానికి బుద్ధుడు తన కనురెప్పలను కత్తిరించుకుని విసిరేశాడటన. కొన్నాళ్లకు ఆ కనురెప్పల నుంచి తేయాకు మొక్కలు మొలకెత్తాయని కొందరి నమ్మకం. తర్వాత కాలంలో తేయాకు తోటల విస్తరణకు ఆ తేయాకు మొక్కలే మూలమని చెబుతారు. బుద్ధుని ప్రసాదంగా జన్మించిన తేయాకును బిక్షువులకు టీ అంటే చాలా ఇష్టపడుతారు. టీతో ఉడికించిన, వడగట్టిన తేనీటిని నిత్యం ఆస్వాదిస్తారు. టీ ప్రత్యేక మూలికలతో తయారు చేయబడుతుంది, ఉత్తేజిత మనస్సుతో ధ్యానానికి ఉపక్రమిస్తారు. ఇప్పటికీ, మీరు బౌద్ధ దేవాలయాలకు వెళితే, పింగాణీ కుండలలో వేడి టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండటం గమనించవచ్చు. బౌద్ధ భిక్షువులే కాదు, మన సన్నిహితులైన కాషాయాంబరధరులు కూడా జీర్ణం అయిన అన్ని రకాల ఆహార పదార్థాలను త్యజించినా టీ విషయంలో షరతులు వర్తించకుండా జాగ్రత్త పడుతున్నారు. అదే టీ మహిమ!
Adipurush : మాట మార్చిన ఆదిపురుష్ రైటర్.. అప్పుడలా, ఇప్పుడిలా!