ఈరోజుల్లో బరువు పెరగడం అనేది కామన్.. కానీ బరువు తగ్గడం మాత్రం చాలా కష్టం.. అయితే బరువు తగ్గెందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. కానీ బరువు తగ్గలేక పోతారు.. అలాంటి వారికోసం ఎన్నో హోమ్ టిప్స్ ఉన్నాయి వాటిని ట్రై చేసి చూడండి. తేడాను మీరే గమంచండి.. ఈరోజు మనం అటుకులతో బరువు తగ్గడం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం..
చాలా మంది ఈజీగా చేసే స్నాక్స్‌లో అటుకులు కూడా ఒకటి. వీటితో పోహా, పాలల్లో కలిపి తినడం, దోశ, ఇడ్లీ పిండిల్లో కూడా వాడతారు. వీటిని తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇవన్నీ మనకు తెలియకుండానే వీటిని ఇన్నిరోజులుగా తింటున్నాం.. ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం..
వీటిలో ఫైబర్ కంటెంట్, ఐరన్ కంటెంట్, పొటాషియం వంటి వివిధ రకాల పోషకాలు శరీరానికి శక్తిని. కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఇది ఇన్సులిన్ మోతాదు మెరుగైన వినియోగాన్ని కూడా నిర్ధారిస్తుంది.. ఆరోగ్యాన్ని కాపాడటంలో అటుకులు బెస్ట్ అని నిపుణులు చెబుతున్నారు..
కార్బోహైడ్రేట్స్ మన బాడీకి లభించే అత్యుత్తమ పోషకాల్లో ఒకటి. ఇది మన శరీర శక్తి స్థాయిలను పెంచుతుంది. మన శరీరాన్ని సైడ్ ఎఫెక్ట్స్‌కి దూరం చేస్తుంది..అటుకుల్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటుంది. ఇది బాడీ వెయిట్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇది బరువు నియంత్రణలో అలాగే ఆక్సీకరణ ఒత్తిడిని బ్యాలెన్స్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్‌కి వ్యతిరేకంగా పనిచేస్తాయి. మంచి కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు..
ఉదయం అటుకులతో తయారు చేసిన ఉప్మా, దద్దోజనం చేసుకొని తినడం మంచిది.. ఇకపోతే అటుకులు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. ఈ అటుకులతో పండ్లు, కూరగాయలు, పెరుగు వంటివి కలిపి కూడా తీసుకోవచ్చు..పోహా తిన్నప్పుడు త్వరగా జీర్ణమవ్వదు. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటుంది.
అదే విధంగా, దీనిని పోహాలా చేసుకుని తినొచ్చు. అందులో ఎక్కువగా కూరగాయలు, పల్లీలు, బఠానీలు వేయాలి. అప్పుడు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇక వీటితో పాటు పాలు, పెరుగు కలిపొచ్చు. వీటితో పాటు పండ్లు కలిపి తినొచ్చు.. బరువు తగ్గుతారు కదా అని కుంబాలు కుంబాలు తినకుండా తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది..