Weight Loss: బరువు తగ్గేందుకు చాలా కష్టపడాల్సి వస్తుంది. రోజు వ్యాయమం, తినే ఆహార పదార్థాలలో కొన్ని చిట్కాలు పాటిస్తే తప్పకుండా బరువు తగ్గుతారు. అయితే మీరు తినే డైట్ లో పాటించే చిట్కాల్లో పొరపాట్లు చేయడంతో తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా బరువు తగ్గకుండా.. పెరుగుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఊబకాయంలో బాధపడుతున్నవారు పొట్ట ఉండటంతో అందహీనంగా కనిపిస్తారు. అంతేకాకుండా తీవ్ర అనారోగ్యాలకు గురయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే మంచింది. ప్రతి రోజు వ్యాయామాలు చేయడం వల్ల కూడా శరీర బరువును నియంత్రించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుతం బరువు తగ్గే క్రమంలో చాలా మంది కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. వీటి కారణంగా బరువు తగ్గినప్పటికీ తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని నిపుణులు అంటున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ పొరపాట్లు చేయడం మానుకోవాల్సి ఉంటుంది.
Read Also: Bhatti Vikramarka : ఆస్తులు అమ్ముకుని ప్రజా సేవ చేసిన ఘనత కాంగ్రెస్ నేతలది
బరువు తగ్గాలంటే ప్రశాంతంగా నిద్ర పోవాలి. ప్రతి రోజు 6 నుంచి 8 గంటల పాటు నిద్రించాలి. అంతేకాకుండా డైట్ మెంటన్ చేయాలని.. ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అతిగా ఆహారాలు తీసుకున్న, నిద్రపోయి బరువు తగ్గడానికి బదులుగా పెరిగే అవకాశాలున్నాయి. మరోవైపు కొంత మంది బరువు తగ్గడం కోసం వారు తినే ఆహారాలు తీసుకోవడం మానేస్తారు. అలా చేయడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఊబకాయం నియంత్రించుకునే క్రమంలో తప్పకుండా ప్రోటిన్లు, ఫైబర్ కలిగిన ఆహారాలు తీసుకోవాలి. అంతేకాకుండా వ్యాయామాలు కూడా చేయాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చాలా మంది ఆఫీసుల్లో కానీ, ఇంకెక్కడైనా కానీ.. ఎక్కువ సేపు కూర్చుని పనులు చేస్తే లావుగా తయారవుతారు. అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి. అయితే బరువు తగ్గాలనుకునేవారు ఒకే చోట ఎక్కువగా సేపు కూర్చోవడం మానుకుంటే బరువును తగ్గించవచ్చు. అంతేకాకుండా ప్రతి రోజు గ్రీన్ టీలను తాగడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు.
