Site icon NTV Telugu

Back Pain: నడుం నొప్పి వేధిస్తోందా? ఈ చిన్న చిట్కా పాటించండి..

C Section Delivery Back Pain

C Section Delivery Back Pain

Back Pain: ఈ మధ్యకాలంలో చాలా మంది నడుము, మెడ, వెన్నునొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో ముప్పై ఏళ్లు దాటని వారూ ఉండడం బాధాకరం. అయితే, జీవనఅలవాట్లు, ఉద్యోగ కారణమో, నిరంతరం గ్యాడ్జెట్స్ వాడకమో.. ఈ సమస్యకు కారణమవుతుంది. వీటితో పాటు మరికొన్ని ముఖ్య కారణాలు కూడా ఉన్నాయి. అయితే.. నడుంనొప్పికి రకరకాల కారణాలే ఉండొచ్చు. ఇది తరచూ తిరగబెడుతుంటుంది కూడా. దీని విషయంలో చాలామందికి ఉపయోగపడే పరిష్కారం ఒకటుంది. అది చాలా తేలికైంది కూడా. అయితే.. ఆస్ట్రేలియా పరిశోధకులు అద్భుత విషయం చెప్పారు. అదేంటా అని ఆలోచిస్తున్నారా? నడకతో నడుంనొప్పికి గుడ్‌బై చెప్పొచ్చట. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజమేనని చెబుతున్నారు . రోజూ నడవటం ద్వారా నడుం నొప్పి తిరగబెట్టకుండా చూసుకోవచ్చని గుర్తించారు.

READ MORE: Vidadala Rajini: జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు చంపేశారు..

వారానికి 80 నుంచి 130 నిమిషాలు.. అంటే రోజుకు కేవలం 11 నుంచి 18 నిమిషాల సేపు నడిచినా నొప్పి తగ్గుతున్నట్టు తేలింది. నడుం నొప్పితో బాధపడుతున్నవారిని ఆరేళ్ల పాటు పరిశీలించి ఈ విషయాన్ని గుర్తించారు. నడుం నొప్పి తిరగబెట్టటమనేది తొలిసారి అయిన గాయం నుంచి సంభవిస్తుంటుంది. వెన్నెముక స్థిరంగా ఉండటానికి తోడ్పడే కండరాల తీరు మారటం దీనికి కారణమవుతుంటుంది. విశ్రాంతి, నొప్పి మందుల వంటివి నొప్పి తగ్గటానికి తోడ్పడినా మళ్లీ తిరగబెడుతుంటుంది. దీంతో చాలామంది కదలటానికి భయపడుతుంటారు. దీంతో ఎముకలకు అంటుకొని ఉండే కండరాల ఆకృతులు మరింత దెబ్బతింటూ వస్తాయి. ఇంత చిన్న చిట్కాను మీరు కూడా పాటించి మంచి ఫలితాన్ని పొందండి.

READ MORE: Hyderabad Drug: హైదరాబాద్‌లో డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టురట్టు.. రూ. 12 వేల కోట్ల మాదకద్రవ్యాలు స్వాధీనం..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీ తెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Exit mobile version