Site icon NTV Telugu

Turmeric: పసుపు వల్ల లాభాలే కాదు నష్టాలూ ఉన్నాయి.. అవేంటంటే..?

Rk

Rk

భారతీయ ఆయుర్వేద వైద్యంలో చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. అనేక వ్యాధులను దూరం చేయడంతో పాటు చర్మ నాణ్యతను మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది. ఇటీవల అమెరికా నుంచి ఒక షాకింగ్ న్యూస్ వచ్చింది. 57 ఏళ్ల మహిళ పసుపు సప్లిమెంట్లు తీసుకోవడం వల్లే కాలేయం దెబ్బతింది. ఆ మహిళ వాపును తగ్గించడానికి రోజూ పసుపు మాత్రలు వేసుకుంది. కానీ.. కొన్ని వారాల్లో ఆమె ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. ఆమె ముఖం పాలిపోయింది. మూత్రం రంగు నల్లగా మారింది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు కాలేయ ఎంజైమ్‌లు సాధారణం కంటే 60 రెట్లు ఎక్కువగా ఉన్నాయని తేలింది. కాలేయ వైఫల్యానికి చాలా దగ్గరగా ఉంది. పసుపు అధికంగా తీసుకోవడం వల్ల ఆమె కాలేయంపై భారీ ప్రభావం పడింది. చికిత్స తర్వాత, ఆ మహిళ పరిస్థితి మెరుగుపడింది. ఈ ఘటనతో సంచలన విషయాలు బయటపడ్డాయి.

READ MORE: K.K Senthil Kumar: ‘జూనియర్‌’ కథ నాకు చాలా నచ్చింది.. RRR తర్వాత ఈ సినిమా అందుకే!

వాస్తవానికి.. కర్కుమిన్ అనేది పసుపులో ఉండే వర్ణద్రవ్యం. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. కర్కుమిన్ పసుపుకు ప్రకాశవంతమైన పసుపు వర్ణద్రవ్యం ఇస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం.. ఆహారానికి రంగు, రుచిని అందించే పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలు ఉన్నాయి. ఇవి కాలేయంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతాయి. కాలేయం అతిపెద్ద శరీర అవయవం. ఇది కొవ్వులను జీవక్రియ చేయడంతో పాటు నిల్వ చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం అధికంగా పసుపు తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతింటుందని గుర్తించారు. నాలుగు, ఎనిమిది వారాల విడతలుగా ఈ పరిశోధన నిర్వహించారు.

READ MORE: Girls For Sale: ఐదో సంతానంగా ఆడపిల్ల.. అమ్మకానికి పెట్టిన తల్లిదండ్రులు

వారికి ఇచ్చే ఆహారంలో పసుపును యాడ్ చేశారు. అలా తీసుకునే వారిలో కాలేయ సమస్యలు ఉత్పన్నమయ్యాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పరిశోధనలో పాల్గొన్న ముగ్గురు వ్యక్తులు నల్ల మిరియాలతో కలిపి పసుపును తీసుకున్నారు. ఇది జీర్ణక్రియకు సహకరించింది. కానీ కేవలం పసుపును తీసుకోవడం వల్ల సమస్యలు వచ్చాయి. పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల విరోచనాలు, ఉబ్బరం, తలతిరగడం, తలనొప్పి, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి. అంతే కాకుండా కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంటుంది. కర్కుమిన్ కొవ్వు కణాలు పెరగకుండా చేస్తుంది. పిత్తాశయ సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు పసుపును వీలైనంత తక్కువగా తినాలి.

Exit mobile version