K.K Senthil Kumar: ‘జూనియర్’ కథ నాకు చాలా నచ్చింది.. RRR తర్వాత ఈ సినిమా అందుకే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్‌టైనర్ ‘జూనియర్’తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాటలు చార్ట్‌బస్టర్ హిట్ అయ్యాయి. టీజర్, ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి స్టార్ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ డివోపీగా పని చేస్తున్నారు. సినిమా జూలై 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
ఈ ప్రాజెక్టు ఎలా స్టార్ట్ అయింది?
-నిర్మాత సాయి గారితో నాకు మంచి పరిచయం ఉంది. ఆయనతో ‘ఈగ’ సినిమా చేశాను. ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ సినిమా గురించి చెప్పారు. డైరెక్టర్ రాధాకృష్ణ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. మంచి ప్రొడక్షన్ హౌస్, టెక్నికల్ టీం కూడా చాలా బాగుంది. అలా ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది.
Also Read
- Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి - మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
- Srinivasa Mangapuram Trailer: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ట్రైలర్‌తోనే అంచనాలు పెంచేసిన జై కృష్ణ!
- Johnny Master - Sekhar Master: టాలీవుడ్లో కలకలం.. జానీ మాస్టర్ - శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం! వీడియో వైరల్
- Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే డ్రీమ్ రోల్ ఇదేనట.. రాజమౌళి పేరు చెప్పి షాకిచ్చిన హీరోయిన్!
ఈ కథలో మిమ్మల్ని అట్రాక్ట్ చేసిన ఎలిమెంట్ ఏమిటి ?
-కొత్తవారిని పరిచయం చేసినప్పుడు ఫ్యామిలీ డ్రామా జానర్ కి వెళ్ళరు. డాన్స్లు ఫైట్లు ఉంటే చాలు అనుకుంటారు. కానీ ఈ సినిమాలో స్ట్రాంగ్ ఎమోషన్ ఉంది. అది నాకు చాలా ఇంప్రెస్ చేసింది. కొత్త హీరో ఇలాంటి ఛాలెంజ్ తీసుకొని చేయడం అనేది నాకు చాలా నచ్చింది
హీరో కిరీటి గురించి?
-కిరీటి చాలా హార్డ్ వర్కర్. చాలా అద్భుతమైన డాన్సర్. యాక్షన్ చాలా బాగా చేస్తాడు. తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. తను బ్యాలెన్స్డ్ యాక్టర్. తను వన్ ఆఫ్ ది బెస్ట్ న్యూ కమ్మర్.
మీరు రాజమౌళి గారితో పెద్ద కాన్వాస్ సినిమాలు చేశారు. ఇప్పుడు జూనియర్ లాంటి న్యూ కమ్మర్ సినిమాని ఎంచుకోవడానికి కారణం?
-ప్రతి సినిమా దేనికదే ప్రత్యేకం. ఒక హెవీ గ్రాఫిక్స్ సిజీ వర్క్ ఉన్న సినిమా తర్వాత ఇలాంటి సినిమా చేయడం నాకూ రిఫ్రెష్ గా అనిపించి చేశాను. ఇందులో ఉన్న కోర్ ఎమోషన్ నాకు చాలా నచ్చింది. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాస్ రావడం తగ్గిపోయింది. ఇలాంటి సమయంలో ఈ సినిమా చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది.
-ఈ సినిమా పాటలు జనాలకి నచ్చాయి. వైరల్ వయ్యారి పాటలో కిరీటి శ్రీలీల డ్యాన్సులు అందరినీ ఆకట్టుకున్నాయి. ట్రైలర్ కూడా బాగా నచ్చింది. ప్రమోషనల్ కంటెంట్ అంతా బాగా రీచ్ అవుతుంది. కచ్చితంగా సినిమాని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు.
మీరు ఒక సినిమాని సెలెక్ట్ చేసుకోవాలంటే కథలో ఎలాంటి ఎలిమెంట్స్ చూస్తారు?
స్టోరీ ఎమోషనల్ గా మూవ్ అవుతుందో లేదో చూస్తాను. అది చాలా ఇంపార్టెంట్. ఎమోషన్ మనల్ని కదిలించకపోతే మిగతా ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నా కూడా వర్కౌట్ అవ్వదు.
మీరు రాజమౌళి గారితో కంటిన్యూగా పని చేశారు కదా..ఇప్పుడు చేస్తున్న సినిమాకి గ్యాప్ రావడానికికారణం ఏమిటి?
-ఇప్పుడే కాదండి. గతంలో కూడా రాజమౌళి గారు నేను వరుసగా సినిమాలు చేస్తున్నప్పుడు మధ్యలో గ్యాప్ ఉండేది. విక్రమార్కుడు, మర్యాద రామన్న నేను చేయలేదు. దీనికి షాక్ అవ్వాల్సిన అవసరం లేదు(నవ్వుతూ) తర్వాత మేము కలిసి పని చేస్తాం.
రవిచంద్రన్ గారితో పనిచేయడం ఎలా అనిపించింది?
రవిచంద్రన్ గారు గ్రేట్ యాక్టర్. ఆయన ఏజ్ లో ఆయనకున్న ఎనర్జీ చూస్తే అన్ బిలియబుల్ అనిపిస్తుంది. ఆయనతో వర్క్ చేయడం రియల్లీ గ్రేట్ ఎక్స్పీరియన్స్
జెనీలియా గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
ఇందులో చాలా డిఫరెంట్ జెనీలియాని చూశారు. ఈ సినిమాలో ఆమె పాత్ర, పెర్ఫార్మన్స్ సరికొత్తగా ఉంటుంది. ఆడియన్స్ చాలా సర్ప్రైజ్ అవుతారు.
డైరెక్టర్ గారి గురించి ?
-డైరెక్టర్ రాధాకృష్ణ చాలా క్లియర్ విజన్ ఉన్న డైరెక్టర్. ఆయనకు ఏం కావాలో చాలా క్లారిటీ ఉంటుంది. ఆయన కథ చెప్పిన విధానం తీసిన విధానం నాకు చాలా నచ్చింది. డైరెక్టర్ కి క్లారిటీ చాలా ఇంపార్టెంట్. ఆ క్లారిటీ ఆయనలో ఉంది.
నిర్మాత సాయి గారి గురించి?
-ఒక కొత్త హీరోని ఎంత అద్భుతంగా లాంచ్ చేయాలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రొడక్షన్ చేశారు. ఒక మంచి సినిమా అందించాలనే పాషన్ తో పని చేశారు. చాలా అద్భుతమైనటువంటి టెక్నికల్ టీం ని ఎంపిక చేసుకున్నారు దేవిశ్రీప్రసాద్ గారి మ్యూజిక్, పీటర్ హెయిన్ లాంటి ఫైట్ మాస్టర్.. టెక్నికల్ గా సినిమా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది వారాహి ప్రొడక్షన్ లో వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.
మీకు దర్శకత్వం చేసే ఆలోచన ఉందా?
-ఆలోచన అయితే ఉంది. అదే అయితే అది ఇప్పుడే కాదు. దానికి ఇంకా చాలా సమయం ఉంది. కొన్ని కథల మీద వర్క్ చేయడం జరుగుతుంది.
మీ జర్నీని చూసుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది?
-ఇండస్ట్రీ లోకి వచ్చి 25 ఏళ్ల అవుతుంది. ఈ 25 ఏళ్ళు మంచి సినిమాలు చేస్తున్నాం, చక్కగా పనిచేస్తున్నామనే పేరు తెచ్చుకోవడం చాలా ఆనందంగా ఉంది. బాహుబలి, ఆర్ఆఆర్ లాంటి సినిమాలు చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
కొత్తగా చేస్తున్న సినిమాలు గురించి?
-స్వయంభు చేస్తున్నాను. అది బహుబలి లాంటి జోనరు. రాజులనాటి కథ. అలాగే ఇండియన్ హౌస్ సినిమా చేస్తున్నాను.
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..