Vastu Tips: వేసవిలో మట్టి కుండ తీసుకున్నారా..? మీ అదృష్టం మారలంటే ఇంట్లో ఈ దిశలో పెట్టండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vastu Tips: వేసవి సమయంలో సామాన్యుడి ఫ్రిజ్‌గా మట్టి కుండలకు పేరు ఉంది.. ఇక చాలా మంది ఫ్రిజ్ వాటర్ తీసుకోవడం ఇష్టం లేనివారు కూడా మట్టి కుండలను తీసుకోవడం చూస్తుంటాం.. వేసవి కాలంలో మట్టి కుండలు ఉపయోగించడం శరీరానికి చల్లదనాన్ని అందించడమే కాకుండా, వాస్తు పరంగా కూడా ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా వైశాఖ మాసంలో ఇంట్లో చేసే చిన్న మార్పులు సానుకూల శక్తిని పెంచి, ఆర్థిక శ్రేయస్సును తీసుకువస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. మీరు కూడా మీ ఇంట్లో సుఖశాంతులు, సంపద పెరగాలని కోరుకుంటే ఈ సులభమైన వాస్తు చిట్కాలను పాటించడం మంచిది అంటున్నారు వాస్తు నిపుణులు..
* మొదటిగా, ఇంటి ఈశాన్య దిశలో మట్టి కుండను ఉంచడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ దిశ పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. శుభ్రమైన నీటితో నింపిన మట్టి కుండను ఈశాన్యంలో ఉంచితే ఇంట్లో చల్లదనం, ప్రశాంతతతో పాటు సానుకూల శక్తి పెరుగుతుంది. ఇది ఆర్థిక స్థిరత్వానికి కూడా దోహదపడుతుందని నమ్మకం.
Also Read
- Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్‌తో రోజంతా సాఫ్ట్‌గా!
- T-Shirt Hacks: మీ పాత టీ-షర్ట్‌లను పడేస్తున్నారా? ఒక్కసారి ఈ ట్రిక్ చూడండి.. 4 వస్తువులు ఫ్రీగా తయారు చేసుకోవచ్చు!
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
- Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
* వైశాఖ మాసంలో తులసి మొక్కకు ప్రత్యేక పూజ చేయడం ఎంతో మంగళకరంగా భావిస్తారు. ప్రతి ఉదయం తులసి మొక్కకు నీరు పోయడం, సాయంత్రం నెయ్యి దీపం వెలిగించడం ద్వారా ఇంటి వాతావరణం శుద్ధి అవుతుంది. దీని వల్ల ప్రతికూల శక్తి తగ్గి, మానసిక ప్రశాంతత పెరుగుతుంది.
* ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా ఉత్తర దిశలోని ప్రదేశాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. పనికిరాని వస్తువులను తొలగించడం ద్వారా ఇంట్లో సానుకూల శక్తి సులభంగా ప్రవహిస్తుంది. చిందరవందరగా ఉన్న ప్రదేశాల్లో మంచి శక్తి నిలవదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
* మనీ ప్లాంట్‌ను ఇంట్లో ఉంచడం కూడా శ్రేయస్సుకు సంకేతంగా భావిస్తారు. దీనిని నీటితో నింపిన గాజు పాత్రలో పెట్టి ఆగ్నేయ దిశలో ఉంచితే సంపద, అభివృద్ధి పెరుగుతాయని చెబుతారు. ఇది మానసిక ప్రశాంతతను కూడా అందిస్తుంది.
* ఇక, ప్రతి ఉదయం ఇంటి ప్రధాన ద్వారం వద్ద నీళ్లు చల్లడం కూడా ఒక మంచి అలవాటు. ఇది ఇంట్లోకి వచ్చే ప్రతికూల శక్తిని తగ్గించి, సానుకూల వాతావరణాన్ని తీసుకువస్తుంది. కావాలంటే ప్రవేశ ద్వారం దగ్గర నీటితో నింపిన రాగి పాత్రను ఉంచుకోవచ్చు. ఇలా.. ఈ చిన్నచిన్న వాస్తు మార్పులు పాటిస్తే, మీ ఇంట్లో సుఖశాంతులు, ఆర్థికాభివృద్ధి పెరిగి జీవితం మరింత సంతోషంగా మారుతుంది.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!